క్లీవేజ్‌ అందాలతో రీతూ వర్మ సంచలనం.. బ్లౌజ్‌ వేసుకోవడం మర్చిపోయావా అంటూ నెటిజన్ల కామెంట్‌.. పూజా హెగ్డేకే షాక్

First Published | Oct 24, 2021, 8:42 AM IST

క్యూట్‌ బ్యూటీ రీతూ వర్మ హాట్‌గా తయారైన వేళ. సంప్రదాయానికి పెద్ద పీట వేసే రీతూ సెక్సీగా కనిపించిన వేళ. అందాల ఆరబోత విషయంలో ఆచితూచి అడుగులేసే రీతూ హాట్‌ షో చేసిన వేళ. ఇప్పుడు రీతూ వర్మ అందాల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

రీతూ వర్మ క్రమంగా తనలోని హాట్‌నెస్‌ని, సెక్సీ యాంగిల్‌ని అటు అభిమానులకు, ఇటు మేకర్స్ కి పరిచయం చేస్తుంది. ఇన్నాళ్లు దాచుకున్న అందాలను కొద్ది కొద్దిగా అభిమానులకు చూపేందుకు ప్రయత్నిస్తుంది. తన అందాల్లోనే మరో యాంగిల్‌ని పరిచయం చేస్తుంది. తాను కూడా కమర్షియల్‌ హీరోయినే అని నిరూపించుకుంటుంది. మొత్తంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హీటు పెంచుతుంది. 

రీతూ వర్మ ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి `వరుడు కావలెను` చిత్రంలో నటిస్తుంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈనేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఐటీసీ కొహినూర్‌లో `వరుడు కావలెను సంగీత్‌ కార్యక్రమం` జరిగింది. ఇందులో హైలైట్‌గా నిలిచింది రీతూ వర్మ. 


ఈ సంగీత్‌ ఈవెంట్‌లో రీతూ వర్మ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లూ శారీలో సెక్సీ పోజులతో హోయలు పోయింది. కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ బాణాలు విసిరింది. అయితే రీతూ వర్మ బ్రా లుక్‌లో కనిపించడం విశేషం. దీంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. బ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. హీరోయిన్లు ఇలాంటి ఈవెంట్లలో ఇలా అందాల ఆరబోతకే ప్రయారిటీ ఇస్తుంటారు. ఆ విషయంలో తానేం తక్కువ కాదని నిరూపించుకుంటోంది రీతూ వర్మ. 
 

ప్రస్తుతం రీతూ వర్మకి సంబంధించిన ఈ ఈవెంట్‌ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో విశేషమేంటంటే గెస్ట్గ్‌ గా వచ్చిన స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డేని మించిన గ్లామరస్‌గా రీతూ ముస్తాబవడం, అంతే హాట్‌గా కనిపించడంతో ప్రస్తుతం నెటిజన్లు రీతూని ట్రెండ్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వైరల్‌ అవుతుండటంతో సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ అమాంతం పెరిగిపోయింది. 

`వరుడు కావలెను` ఈవెంట్‌కి పూజా హెగ్డే గెస్ట్ గా రావడం పట్ల రీతూ వర్మ ఆనందాన్ని వ్యక్తం చేసింది. హీరోయిన్లు గెస్ట్ గా రావడం చాలా అరుదుగా జరుగుతుంటుందని, పూజా విషయంలో తనకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది రీతూ. సినిమాపై ప్రశంసలు కురిపించింది. నాగశౌర్య, నిర్మాత నాగవంశీ, దర్శకురాలికి అభినందనలు తెలిపింది. 

ఈ చిత్రంలో మరో బలమైన పాత్రలో కనిపించబోతుంది రీతూ వర్మ. `పెళ్లి చూపులు` సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న రీతూ వర్మ తాను నటించే ప్రతి సినిమాలోనూ తన పాత్ర మహిళా సాధికారతకు అద్దం పడుతుంది. ఇటీవల చేసిన `టక్‌ జగదీష్‌`లోనూ శక్తివంతమైన విలేజ్‌ వీఆర్‌వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో నటించి మెప్పించింది. 

ప్రస్తుతం నటిస్తున్న `వరుడు కావలెను` చిత్రంలో భూమి అనే మరో శక్తివంతమైన పాత్రలో రీతూ కనిపించబోతుందట. ఓ డిఫరెంట్‌ లవ్‌ స్టోరీగా సాగే ఈ చిత్రంలోని ప్రేమ కథ రీతూ చుట్టూతే తిరుగుతుందని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోనూ ఆ విషయం స్పష్టమైంది. కచ్చితంగా ఈ సినిమాతో రీతూ హిట్‌ని తన ఖాతాలో వేసుకోబోతుందని తెలుస్తుంది. 
 

సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. దీంతో యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన రీతూ వర్మ ఎన్టీఆర్‌ నటించిన `బాద్షా` చిత్రంతో నటిగా మారింది. ఇందులో చిన్న పాత్రలో మెరిసింది. దీని తర్వాత `ప్రేమ ఇష్క్ కాదల్‌`లో నటించి ఆకట్టుకుంది. ఇలా `నా రాకుమారుడు`, `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాల్లో కనిపించింది. 

`ఎవడే సుబ్రమణ్యం`తో విజయ్‌ దేవరకొండతో ఏర్పడిన పరిచయం `పెళ్లిచూపులు`కు దారితీసింది. ఇందులో విజయ్‌తో నటించి సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రంతో అటు విజయ్‌, ఇటు రీతూ పాపులర్‌ అయ్యారు. 

అనంతరం `కేశవ`, `నిన్నిలా నిన్నిలా` చిత్రాల్లో మెరిసింది. విజయాలు అందుకుంది. మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి `వెలైల్లా పట్టదారి 2`, `కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయధిథాల్‌`(కనులు కనులను దోచాయటే) చిత్రాల్లో మెరి విజయాలు అందుకుంది. ప్రస్తుతం `వరుడు కావలెను` చిత్రంతోపాటు తెలుగు, తమిళంలో రూపొందుతున్న `ఒకే ఒక జీవితం`లో శర్వానంద్‌ సరసన నటిస్తుంది రీతూ వర్మ.

అనంతరం `కేశవ`, `నిన్నిలా నిన్నిలా` చిత్రాల్లో మెరిసింది. విజయాలు అందుకుంది. మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి `వెలైల్లా పట్టదారి 2`, `కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయధిథాల్‌`(కనులు కనులను దోచాయటే) చిత్రాల్లో మెరి విజయాలు అందుకుంది. ప్రస్తుతం `వరుడు కావలెను` చిత్రంతోపాటు తెలుగు, తమిళంలో రూపొందుతున్న `ఒకే ఒక జీవితం`లో శర్వానంద్‌ సరసన నటిస్తుంది రీతూ వర్మ. 

also read: సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

Latest Videos

click me!