Raashi Khanna: సిల్క్ చీర స్లీవ్ లెస్ జాకెట్... వయ్యారాలతో మైమరిపిస్తున్న ఢిల్లీ బేబీ రాశి ఖన్నా

First Published Jan 10, 2022, 5:20 PM IST


వరుస ఆఫర్స్ తో సౌత్ ని ఊపేస్తున్న రాశి ఖన్నా... తాజాగా బాలీవుడ్ మూవీ కూడా ప్రకటించారు. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీని బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
 


రాశి ఖన్నా (Raashi khann)టాలీవుడ్ కి వచ్చి ఏడేళ్లు అవుతుంది. ఈ ఏడేళ్ల కెరీర్ లో రాశి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా 25 సినిమాలకు  పైగా చేశారు. అయితే ఆమె స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కించుకోలేకపోయారు. 

రాశి కెరీర్ మొత్తం టూ టైర్ హీరోలతోనే సరిపోయింది. మహేష్ (Mahesh), ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టే అవకాశం ఆమెకు దక్కలేదు. సాలిడ్ అందాలతో కిరాక్ తెప్పించే ఈ పొడుగు సుందరి కెరీర్ కి అదొక రిగ్రీట్ అని చెప్పాలి. అయితే ఆమె అవకాశాలు ఇంకా మూసుకు పోలేదు. తెలుగులో చిత్రాలు చేస్తున్న రాశికి, స్టార్స్ తో జతకట్టే చాన్సులను కొట్టిపారేయలేం. 
 

వెండితెరపై మితిమీరిన గ్లామర్ పంచే రోల్స్ ఆమెకు దక్కలేదు. వెండితెరపై అందాలు ప్రదర్శించే అవకాశం దక్కకున్నా.. సోషల్ మీడియా ద్వారా తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాకు సెగలు పుట్టిస్తుంది. 

 
కాగా రాశి ఖన్నా కెరీర్ సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వెళుతోంది. ఊహలు గుసగుసలాడే మూవీతో రాశి ఖన్నా పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ శౌర్య (Naga Shuarya)హీరోగా నటించగా రాశి ఖన్నా పాత్ర బాగా ఆకట్టుకుంది. 
 

ఆ తరువాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ దక్కాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం జరిగింది. పెద్దగా హిట్ పర్సెంటేజ్ లేకున్నా, జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించే ఛాన్స్ పట్టేసింది రాశి ఖన్నా. రాశి ఖన్నా కెరీర్ లో నటించిన అతిపెద్ద స్టార్ ఎన్టీఆర్ కావడం విశేషం. 


హద్దులు లేని స్కిన్ షోకి ఆమె దూరంగా ఉన్నారు. ఓ మోస్తరుగా పొట్టి బట్టలు ధరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అయితే అనూహ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశి ఖన్నా బోల్డ్ రోల్డ్ చేశారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో కలిసి ఆమె చేసిన రొమాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ ని షాక్ కి గురిచేసింది.
 

 
అంత పెద్ద రిస్క్ చేసిన రాశికి సినిమా పరాజయంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. రాశి అలాంటి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ చేసి ఉండాల్సింది కాదని రాశి సన్నిహితులతో వాపోయారన్న వార్తలు కూడా రావడం జరిగింది. 


లాక్ డౌన్ తరువాత రాశి కెరీర్ మరలా ఊపందుకుంది. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీగా మారారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు పక్కా కమర్షియల్, థ్యాంక్యూ  లతో పాటు నాలుగు తమిళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే రెండు వెబ్ సిరీస్ లలో రాశి ఖన్నా నటిస్తున్నారు. 

click me!