Priyamani:భుజాలపై నుండి జారిపోతున్న ప్రియమణి గౌను, ఆ సోకులు చూస్తే కుర్రాళ్ళు ఏం కాను..!

Published : Oct 27, 2021, 11:40 AM IST

పాత్ర ఏదైనా ప్రియమణి పోషిస్తే రక్తి కట్టాల్సిందే. అందుకే ఆమె దశాబ్ద కాలంగా బిజీ హీరోయిన్ గా ఉన్నారు. బోల్డ్ రోల్స్ నుండి డీగ్లామర్ రోల్స్ వరకు అన్ని తరహా పాత్రలు చేసిన Priyamani, తన మార్కు చూపించారు.

PREV
18
Priyamani:భుజాలపై నుండి జారిపోతున్న ప్రియమణి గౌను, ఆ సోకులు చూస్తే కుర్రాళ్ళు ఏం కాను..!

సౌత్ లోనే కాదు ఇండియా మొత్తంలో ఓ తరహా పాత్రలకు ప్రియమణి తిరుగులేని నటి. ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఆమె ఎక్కువ సంపాదిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాకపోయినా మంచి నటి అని నిరూపించుకోవడమే దీనికి కారణం.

28

ప్రస్తుతం హిందీ, తెలుగు, కన్నడ, తమిళ బాషలలో కలిపి ఏడు చిత్రాల వరకు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగులో విరాటపర్వం చేస్తుండగా, కథలో కీలకమైన లేడీ నక్సలైట్ రోల్ చేస్తున్నారు. నారప్ప తరువాత Virata parvamలో  మరోమారు డీ గ్లామర్ రోల్ చేసి మెప్పించనున్నారు. 

38

ఇక దర్శకుడు అట్లీ-షారుక్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లయన్ చిత్రంలో ప్రియమణి మరో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. నయనతార ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రియమణి మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. దీనితో పాటు మైదాన్ మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా చేస్తున్నారు.

48

Shahrukh khan క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రియమణి అటు డిజిటల్ సిరీస్ లు వదలడం లేదు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో నటుడు మనోజ్ బాజ్ పాయ్ భార్య రోల్ చేయగా, ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఈ రెండు సిరీస్లు విజయం సాధించడం విశేషం. 

58

మరోవైపు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నారు ప్రియమణి. ఆమె జడ్జిగా ఉన్న డాన్స్ రియాలిటీ షో ఢీ అత్యంత ఆదరణ దక్కించుకుంటుంది. తెలుగులో అత్యధిక టీఆర్పీ కలిగిన షోల్లో ఇది ఒకటిగా ఉంది.

68

కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచన పక్కన పెట్టారు. ఇప్పటికే 37ఏళ్ళు దాటిపోగా పిల్లలు కనడానికి ఇంకా సమయం ఉందని అంటుంది ప్రియమణి.

78

 
కాగా ప్రియమణి 2017లో ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని వివాహం చేసుకున్నారు. ముస్తఫా రాజ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. 

88

ప్రస్తుతం వృత్తి రీత్యా ముస్తఫా రాజ్ అమెరికాలో ఉంటున్నారు. ప్రియమణి నటిగా ఇండియాలో బిజీగా ఉంటున్నారు. ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్స్ లో తలమునకలైనా.. రోజుకు ఒక్కసారైనా ఫోన్ లో మాట్లాడుకుంటారట.

Also read హాట్ బాంబ్ శ్రీరెడ్డితో సుడిగాలి సుధీర్, పక్కనే బిగ్ బాస్ ప్రియ... ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటో

Also read ఆ పిల్ల బాత్రూమ్ లో నేనెందుకుఉంటాను రా... : ప్రభాస్

click me!

Recommended Stories