సౌందర్య ట్విస్ట్.. మోనిత భర్త స్థానంలో డాక్టర్ బాబు.. వంటలక్క షాక్!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 27, 2021, 09:45 AM IST

బుల్లితెరపై ప్రసారమైన కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ మొదటి రేటింగ్ తోనే దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
18
సౌందర్య ట్విస్ట్.. మోనిత భర్త స్థానంలో డాక్టర్ బాబు.. వంటలక్క షాక్!

దీప (Deepa) హిమ బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్ కోసం ల్యాబ్ దగ్గరికి వారణాసి (Varanasi) కారులో వెళ్తుంది. ఇక డాక్టర్ బాబు, సౌందర్య ఏదో దాచేస్తున్నారని అనుకుంటుంది. మధ్యలో వారణాసి అమెరికా ప్రయాణం గురించి అడిగేసరికి కాస్త వెటకారంగా సమాధానం ఇస్తుంది.
 

28

మరోవైపు మోనిత (Monitha) హాస్పిటల్ లో పురిటి నొప్పులతో బాధపడుతుంది. భారతి ఎంత బ్రతిమాలినా ఇంజెక్షన్ కూడా ఇప్పించుకోదు. కార్తీక్ (Karthik) రావాలి అని మారం చేస్తుంది. భారతి ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే వెంటనే దాన్ని పగలగొడుతుంది.
 

38

 దీప ల్యాబ్ దగ్గరికి వెళ్లి హిమ (Hima) రిపోర్ట్స్ అడగటంతో ల్యాబ్ టెక్నీషియన్ వాటిని ఇస్తుంది. ఇక అదే ల్యాబ్ లో గతంలో కార్తీక్ శాంపిల్స్ ఇచ్చాడని తెలియడంతో ఆ ల్యాబ్  టెక్నీషియన్ని దీప (Deepa) కోపంతో ఓ రేంజ్ లో తిడుతుంది.
 

48

శాంపిల్స్ టెస్ట్ కోసం వస్తే అమ్ముకుంటారా అని మండిపడుతుంది.ఆ ల్యాబ్ టెక్నీషియన్ మాత్రం తాము ఇవ్వలేదని ఎవరు వచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఇటువంటి పని చెయ్యమని గట్టిగా చెప్పేసరికి దీప (Deepa) మరో మాట అనకుండా అక్కడి నుంచి ఆలోచనలో పడుతూ వెళ్ళిపోతుంది.
 

58

హాస్పిటల్లో మోనిత (Monitha) పురిటి నొప్పులతో బాధపడుతూ కార్తీక్ కు చచ్చిపోయే లోపు ఒక నిజం చెప్పాలని అంటుంది. మోనిత నొప్పులతో స్పృహ కోల్పోగా సౌందర్య, కార్తీక్ (Soundarya, Karthik) అక్కడికి చేరుకుంటారు. అవన్నీ చూసి ఇదంతా డ్రామా అని కార్తీక్ అంటాడు.
 

68

భారతి (Bharathi) ఎంత చెప్పినా కార్తీక్ మాత్రం వినడు. ఇదంతా అబద్ధమని మరో కొత్త నాటకమని అంటాడు. ఇక మోనిత (Monitha) లేవగానే పురిటి నొప్పులతో కార్తీక్ తో మాట్లాడుతుంది. ఇది ఆర్టిఫిషియల్ గర్భం కాదని సహజంగా జరిగింది అనేసరికి సౌందర్య, కార్తీక్, భారతి షాక్ అవుతారు.
 

78

వెంటనే కార్తీక్ (Karthik) కోపంతో రగిలిపోతూ అదంతా అబద్ధమని అనగా లేదు ఇదంతా నిజమని బాగా తాగి ఉన్నప్పుడు జరిగిందని మోనిత (Monitha) అంటుంది. తనని నమ్ము అంటూ గతంలో అబద్దం చెప్పడానికి కారణం పెళ్లికి ముందే అలాంటి పని చేసిందని అంటారని అబద్ధం చెప్పాను అంటుంది.
 

88

తరువాయి భాగంలో మోనిత బిడ్డకు జన్మనిచ్చినది,  కార్తీక్ మోనితకు భర్త స్థానం లో పేపర్స్ పై సైన్ చేసాడని ప్రియమణి (Priyamani) చెప్పడంతో దీప (Deepa) షాక్ కు గురై గుడికని అబద్ధం చెప్పి మోనిత దగ్గరికి వెళ్లారా అని అనుకుంటుంది.

click me!

Recommended Stories