మహేంద్ర ఆడుతున్న నాటకంతో రిషి మనసులో మాట బయట పడేనా.. వసుపై ప్రేమను బయటపెడుతాడా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 27, 2021, 09:01 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
మహేంద్ర ఆడుతున్న నాటకంతో రిషి మనసులో మాట బయట పడేనా.. వసుపై ప్రేమను బయటపెడుతాడా?

మహేంద్ర వర్మ (Mahendra Vama) కు జ్వరం రావడంతో రిషి బలవంతంగా కషాయం తాపిస్తాడు. ఇక కషాయం జగతి (Jagathi)చేసే లాగా ఉంది అనుకుంటాడు. రిషి ఇక నాలుగు మాటలు మాట్లాడి అక్కడనుంచి వెళ్ళిపోగా.. ధరణి, మహేంద్ర వర్మ మురిసిపోతుంటారు.
 

27

ఇక ఉదయాన్నే అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో వసుధార (Vashudhara) రావటంతో దేవయాని, రిషి ఇంత సడన్ గా ఎందుకు వచ్చిందో అని అనుకుంటారు. ఇక దేవయాని (Devayani) ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో మహేంద్ర వర్మ నేనే రమ్మన్నానని వసుని పైకి తీసుకెళ్తాడు.
 

37

రిషికి (Rishi) తనను పిలవలేదన్న కోపం వస్తుంది. మహేంద్ర వర్మ  కావాలని ఇదంతా ప్లాన్ చేయగా రిషి వస్తున్న విషయాన్ని గమనించి కావాలని వసుతో (Vasu) ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతాడు. ఎంగేజ్మెంట్ కావలసిన ఏర్పాట్ల గురించి మాట్లాడటంతో షాక్ అవుతాడు రిషి.
 

47

మరోవైపు దేవయాని రిషికి (Rishi) కషాయం చేయడం ఎలా వచ్చని ఆలోచనలో పడుతుంది. ధరణితో కషాయం  విషయంలో కాస్త గొడవ పడుతుంది. ధరణి (Dharani) మాత్రం ఇప్పుడు ఏమీ అనలేను అంటూ తర్వాతే సమయం వస్తుందని అనుకుంటుంది.
 

57

ఇక రిషి (Rishi) నేరుగా శిరీష్ కి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతాడు. శిరీష్ (Sirish) కూడా మాట్లాడుతూ ఎంగేజ్మెంట్ విషయం సార్ చెప్పారా లేదా మా వసు చెప్పిందా అనేసరికి రిషి ముఖంలో తెలియని బాధ కనిపిస్తుంది. పదే పదే రిషి మాటలను తలుచుకుంటాడు.
 

67

కాలేజీలో వసు (Vasu) తన ఫ్రెండ్ తో మాట్లాడుతుండగా కావాలనే రిషి వచ్చి తనపై కోపడతాడు. కాలేజీకి వచ్చి చదువుకోకుండా ప్రేమ, పెళ్లి అంటూ తన మనసులో ఉన్న కోపాన్ని, బాధను బయటపెడతాడు.
 

77

అప్పుడే జగతి (Jagathi) రావడంతో తనతో కూడా స్టూడెంట్స్ కి కాస్త కొన్ని విషయాలు నేర్పించాలని అంటాడు. మొత్తానికి మహేంద్రవర్మ ఆడుతున్న నాటకంతో రిషి తన మనసులో మాట బయటపెట్టేలా ఉన్నాడు.

click me!

Recommended Stories