Katrina kaif: డిసెంబర్ లో విక్కీ-కత్రినా వివాహం... విశ్వసనీయవర్గాల సమాచారం ఏంటంటే

First Published | Oct 27, 2021, 12:37 PM IST

బాలీవుడ్ స్టార్స్  కత్రినా ఖైఫ్, విక్కీ కౌశల్ రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఈ క్రేజీ కపుల్ పెళ్ళికి సిద్దమయ్యారన్న వార్తలు గుప్పుమనగా... అసలు నిజం ఏమిటో చూద్దాం


గత రాత్రి నుంచి Katrina kaif, విక్కీ కౌశల్ పెళ్లి గురించిన వార్తలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఇద్దరూ డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని,ర పెళ్లి దుస్తులను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందిస్తున్నాడని అంటున్నారు. అలాగే తమ దుస్తులకు అవసరమైన ఫ్యాబ్రిక్స్ ఎంపిక చేసే పనిలో వీరిద్దరూ ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 

అయితే కత్రినా, Vicky kausal సన్నిహితులు మాత్రం ఈ పెళ్లి వార్తలను ఖండిస్తున్నారు. ప్రచారం జరుగుతున్నట్లు విక్కీ, కత్రినా పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడం లేదని తెలిపారు. కొన్నాళ్లుగా విక్కీ, కత్రినా పెళ్లి పై పుకార్లు వస్తూనే ఉన్నాయని, ఈసారి కూడా అలాంటివే అంటూ కొట్టిపారేశారు. 



విక్కీ, కత్రినా కలిసి ఓ సెలబ్రిటీ మేనేజర్ ని కలవడం జరిగింది. ఇది పెళ్లి ఏర్పాట్లలో భాగమే అని భావించిన కొందరు, ఈ పుకార్లను వ్యాప్తి చేశారు. ఆ విధంగా కత్రినా, కౌశల్ డిసెంబర్ లో వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు బయటికి రావడం జరిగింది. 

ఓ మీడియా సంస్థ కథనం ప్రకారం ఓ ప్రాజెక్ట్ కోసం కత్రినా, విక్కీ కలిశారు. ఆ ప్రాజెక్ట్ సినిమా లేదా యాడ్ షూట్ కావచ్చని తెలియజేశారు. అసలు నిజాలు బయటికి రావడంతో కత్రినా పెళ్లి పుకార్లకు మరలా చెక్ పడింది. 

కత్రినా ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన అక్షయ్ కుమార్ సూర్యవంశీ చిత్ర ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అలాగే ఆమె సల్మాన్Tiger 3, ఫోన్ బూత్ చిత్రాలలో నటిస్తున్నారు. 

మరోవైపు విక్కీ ఆయన లేటెస్ట్ మూవీ సర్దార్ ఉద్ధమ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓటిటిలో విడుదలైన Sardar udham చిత్రం హిట్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఆదిత్య ధార్ దర్శకత్వంలో అశ్వథామ చిత్రంలో నటిస్తున్నారు.

Also read Priyamani:భుజాలపై నుండి జారిపోతున్న ప్రియమణి గౌను, ఆ సోకులు చూస్తే కుర్రాళ్ళు ఏం కాను..!

Aslo read పెళ్లిపై తనదే ఫైనల్‌ డిసీషన్‌ అంటోన్న రీతూ వర్మ.. వెడ్డింగ్‌ ఎప్పుడో కూడా చెప్పేసిందిగా..

Latest Videos

click me!