హీరోయిన్ హన్సిక హీరోయిన్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సినిమాలు చేసి సౌత్ ఆడియన్స మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్. జయాపజయాలతో సంబంధం లేకుండా.. విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి పాఠాలు చెపుతోంది హన్సిక.
వెండితెరపై పదేండ్ల ప్రయాణం హన్సిక మోత్వానిది. ఈ పదేళ్ళలో 50 సినిమాలతో హన్సిక రికార్డ్ క్రియేట్ చేసింది. ఫెయిల్యూర్స్ ను ఎక్కువగా ఫేస్ చేసిన ఈ నటి.. ప్రతీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె 50వ సినిమాతో రెడీగా ఉంది.
29
దాదాపు రెండేండ్ల గ్యాప్ తర్వాత ఏడు వరుస సినిమాలతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెఢీగా ఉంది హన్సిక.ఈ సొట్టబుగ్గల సుందరి తన కొత్త సినిమాల గురించి సంగతులు, విభిన్న పాత్రల విశేషాలల గురించి. తన ఎలాంటి సక్సెస్ పార్ములా వాడిందో చెపుతోంది.
39
కొత్తగా సినీ పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారు ఆశతో ఉండండి.. ఈ క్షణంలోనే బతకండి. కష్టపడి పనిచేస్తూ వెళ్తుంటే నేచర్ కూడా సహకరిస్తుందని అంటోంది హన్సిక. అప్పుడు తప్పక సక్సెస్ సాధిస్తారంటోంది. ఎందుకంటే ఈ జీవన సూత్రాన్ని తాను కూడా పాటించానంటోంది ముద్దుగుమ్మ.
49
హన్సిక తెలుగు కన్నా తమిళ్ లో ఎక్కవ ఇమేజ్ ను.. స్టార్ డమ్ ను అనుభవించంది. ఇప్పుడు హీరోయిన్ గా వెనుకబడినా.. తనకు తగిన పాత్రలో మెప్పిస్తోంది. ఈ విషయంలొ హన్సిక మాట్లాడుతూ.. నా అందానికి తగ్గట్టు గ్లామర్ పాత్రలు వస్తే చెయ్యడానికి వెనకాడను అంటోంది. తను సినిమాలు చేసే విధానం గురించి తానే చెప్పుకుంది
59
ఏ పాత్రకైనా శ్రమ, శక్తి కావాలి. పాత్రను ఆవాహనం చేసుకోలేకపోతే.. అవుట్‌పుట్ సరిగా రాదు. ఏ పాత్రా కష్టమైంది కాదు.. అలాగని సులువైంది కూడా కాదు. అందుకే ఏ సినిమా అయితే.. ఏ పాత్ర అయినా సరే దానికి తగ్గ కృషి చేయాలంటోంది హన్సిక.
69
హన్సిక తన 50వ సినిమా మహా రిలీజ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నది. ఇది నా 50వ చిత్రం. ఆశనిరాశల్ని అధిగమించే మానసిక స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నానంటోంది హన్సిక. ఇక రీసెంట్ గా తన 55వ సినిమా షూటింగ్ ప్రారంభమైందంటోంది.
79
హన్సిక కొత్తదనం ఉన్న కథను బాగా ఇష్ట పడుతుంది. నటనలో మరింత వైవిధ్యం ఉండేలా తనను తాను తీర్చిదిద్దుకుంటానంటోంది హన్సిక. హన్సిక ఇక ముందు కొత్తగా కనిపిస్తానంటోంది. ఇప్పటి వరకూ మీరు చూసిన హన్సిక వేరు. రానున్న సినిమాల్లో హన్సిక వేరు అంటోంది. అంతే కాదు నటనలో తాను ఎంత పరిణతి చెందానో మీరే చూస్తారంటోంది.
89
డైరెక్టర్లు కూడా తనను కొత్తగా చూపించాలని ఆలోచనలో ఉన్నారంటోంది హన్సిక. తనను కొత్త కోణంలో చూపించాలని అనుకుంటున్నారు. డైరెక్టర్లు కూడా తనపై ఎంతో నమ్మకంతో ఉన్నారు అని హన్సిక అంటోంది. నేను మోయగలిగే ప్రాజెక్టులనే భుజాలకు ఎత్తుకున్నాను. నన్ను విభిన్నమైన పాత్రలకు ఎంపిక చేసే దర్శకులకే ఆ క్రెడిట్ దక్కుతుంది అంటోంది.
99
అంతే కాదు ఓటీటీలు వచ్చాక హీరోయిన్లకు స్కోప్ పెరిగిపోయిందంటోంది హన్సిక. తాను కూడా కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్నానంటొంది. సోషల్క మీడియాలో తాను డైరెక్టర్ గా మారిపోతున్నానంటు వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటోంది. ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అనేది చాలా పెద్ద టాస్క్. నేను దర్శకత్వం వైపు వెళ్తున్నాననే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు అంటుంది హన్సిక.