బాలీవుడ్ ను భయపెట్టబోతోన్న చిన్నారి పెళ్లి కూతురు, హీరోయిన్ గా బీటౌన్ లో ఫస్ట్ మూవీ

Published : Apr 24, 2022, 07:46 PM IST

అవ్వడానికి బాలీవుడ్ అమ్మాయే అయినా.. టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సాధించింది అవికా గౌర్.. ఇక్కడే హీరోయిన్ గా కూడా మారింది. వరుస సినిమాలు చేసిన బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ వైపు చూస్తోంది. 

PREV
15
బాలీవుడ్ ను భయపెట్టబోతోన్న చిన్నారి పెళ్లి కూతురు, హీరోయిన్ గా బీటౌన్ లో ఫస్ట్ మూవీ

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది బాలీవుడ్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ కంటే కూడా తెలుగు  బుల్లితెరపైనే మంచి ఇమేజ్ సాధించుకుంది. సీరియల్స్ ద్వారానే  కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్‌ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సిన్వర్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేసుకుంది. 

25

రాజ్ తరుణ్ హీరో తెరెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అవికా గౌర్.. రాజ్ తరుణ్ తోనే మరికొన్ని సినిమాలు కూడా చేసింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ,ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్‌, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. 
 

35

అయితే ఈమధ్య టాలీవుడ్ లో అవకా గౌర్ కు అవకాశాలు తగ్గిపోయాయి.అంతే కాదు స్టార్ హీరోల సరసన కూడా సినిమాలు చేయలేకపోయింది అవికా. చిన్న హీరోలతోనే సర్ధుకోవల్సి వచ్చింది. దాంతో బాలీవుడ్ లోనైనా ఓ రాయి వేద్దాం అనుకుంది. అందుకే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కు గ్రాండ్‌గా ఎంట్రీ  ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 
 

45

బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ విక్రమ్‌ భట్‌ అవికాను బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు. 2008 లో ఆయన  డైరెక్ట్‌ చేసిన హార్రర్‌ మూవీ 1920. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆడియన్స్ లో క్రేజ్ సాధించింది. ఇక  ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్.  1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌ పేరుతో తెరకెక్కబోయే సినిమాలో  అవికా గోర్‌  లీడ్‌ రోల్‌ చేయబోతున్నట్టు డైరెక్టర్ విక్రమ్‌ భట్‌ ప్రకటించారు. 

55

ఈ సినిమాకు విక్రమ్‌ భట్‌ నిర్మాతగా గా..ఆయన కుమార్తె కృష్ణ భట్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక ఈమూవీకి రచయిత, దర్శకుడు మహేశ్ భట్‌ కథ అందిస్తున్నారు. అయితే అవికా గోర్‌ ఇది వరకు రాజుగారి గది 3లో దెయ్యంగా నటించింది. ఇక ఇప్పుడు ఈ హిందీ సినిమాతో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. 
 

click me!

Recommended Stories