Hrithik Roshan Comments: రూమర్డ్ గార్ల్ ఫ్రెండ్ గురించి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సెన్సెషనల్ కామెంట్స్

Published : Apr 24, 2022, 05:52 PM IST

మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు బాలీవుడ్ స్టార్, కండల వీరుడు హృతిక్ రోషన్. అది కూడా తన రూమర్డ్ గార్ల్ ఫ్రెండ్  వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆమె అంటే ఎంత ఇష్టం లేకపోతే ఇంతలా పొగిడేస్తాడు.   

PREV
16
Hrithik Roshan Comments: రూమర్డ్ గార్ల్ ఫ్రెండ్ గురించి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సెన్సెషనల్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్స్ లో హృతిక్ రోషన్ కాస్త డిఫరెంట్. తన ఆలోచనలు, పనులు అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ఏం చేసినా వెరైటీగా చేస్తాడు. తన సినిమాలు కూడా అలానే ఉంటాయి. అప్పట్లోనే క్రిష్, ధూమ్  లాంటి హాలీవుడ్ మార్క్ సినిమాలను ఇండియన్ ఆడియన్స్ కు టేస్ట్ చూపించాడు  హృతిక్.

26

ఇక తన  పర్సనల్ లైఫ్ లో కూడా హృతిక్ తన మార్క్ ను కొత్తగా చూపిస్తాడు. భర్యతో విడాకులు, గర్ల్ ఫ్రెండ్స్, లాంటి విషయాలతో ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాడు హృతిక్ రోషన్.  
 

36

ఇక హృతిక్‌ రోషన్‌ ఈ మధ్య కాలంలో తన రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సబా ఆజాద్‌ గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.రీసెంట్ గా ఆమె పై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ స్టార్. ఆమె నటన అదరహో అంటూ ఆకాశానికి ఎత్తాడు. 

46

రీసెంట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నెటిజన్స్‌ను అలరిస్తోన్న ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్ రాకెట్‌ బాయ్స్‌. ఈ రాకెట్‌ బాయ్స్‌ వెబ్‌ సిరీస్‌లో హృతిక్‌ రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సబా ఆజాద్‌ నటించింది. తన నటనను మెచ్చుకుంటూ పొగడ్తలతో ముంచెత్తాడు హృతిక్‌. సబా ఆజాద్‌ గురించ చెపుతూ.. నేను చూసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరు. మీరు నాకు స్ఫూర్తినిస్తున్నారు. అంటూ కితాబిచ్చాడు ఈ బాలీవుడ్‌  స్టార్ హీరో. 
 

56

సోనీ లివ్‌ ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌.. ప్రఖ్యాత భారతీయ సైంటిస్టులు హోమీ జె. బాబా, విక్రమ్‌ సారాబాయ్‌ జీవితాలకు సంబంధించిన కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్స్‌ ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌ను పొగుడ్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు హృతిక్‌ రోషన్‌. 

66

మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొత్తం టీం వర్క్‌ ఎంతో అద్భుతంగా ఉంది. ఇండియాలోని మనవాళ్లే ఇది చేశారంటే గర్వంగా ఉంది. అని సోషల్ మీడియాలో వెల్లడించాడు హృతిక్. అలాగే ఈ వెబ్‌ సిరీస్‌లో సౌత్‌ బ్యూటీ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. 

click me!

Recommended Stories