విజయ్ దేవరకొండతో పాటు మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. కారణం... వీరందరూ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో పని చేసినవారే. మహానటి చిత్రంలో విజయ్ దేవరకొండ నటించారు. ఇక సీతారామం మూవీలో దుల్కర్, మృణాల్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట.