రిలేషన్ షిప్ లో ఉండేవాడ్ని కానీ బ్రేకప్ అయ్యింది, సైకో లవర్స్ ని వదిలించుకోవడం కష్టం!

Published : Apr 21, 2024, 07:26 PM IST

సింగర్ శ్రీరామ చంద్ర లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన లవ్ ఎఫైర్స్ పై కీలక కామెంట్స్ చేశాడు. చాలా బ్రేకప్స్ అయ్యాయంటూ బాంబు పేల్చాడు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
15
రిలేషన్ షిప్ లో ఉండేవాడ్ని కానీ బ్రేకప్ అయ్యింది, సైకో లవర్స్ ని వదిలించుకోవడం కష్టం!
Sreerama Chandra

ఇండియన్ ఐడల్ గెలిచిన శ్రీరామ చంద్ర ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టాడు. స్టార్ సింగర్ గా అవతరించాడు. అనంతరం 2021లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 5లో పాల్గొన్నాడు. 

25
enter

హౌస్లో బాగానే రాణించాడు శ్రీరామ చంద్ర. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఫైనల్ కి వెళ్ళాడు. ఆ సీజన్ విన్నర్ గా సన్నీ ఉన్నాడు. షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు. మూడో స్థానం శ్రీరామ చంద్రకు దక్కింది. ప్రస్తుతం పలు చిత్రాలకు ప్లే బ్యాక్ సింగర్ గా పని చేస్తున్నాడు. 

 

35

కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్స్ మీద శ్రీరామ చంద్ర స్పందించాడు. రీతూ చౌదరి హోస్ట్ గా ఉన్న దావత్ షోకి ఆయన గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలో రీతూ చౌదరి బోల్డ్ ప్రశ్నలతో మనోడిని ఇబ్బంది పెట్టింది. మొహమాటం లేకుండా చెప్పాడు శ్రీరామ చంద్ర. 

45

శ్రీరామ చంద్ర మాట్లాడుతూ... గతంలో నేను రిలేషన్ షిప్ లో ఉండేవాడిని. కానీ బ్రేకప్ అయ్యింది. దాని తాలూకు దెబ్బ గట్టిగానే తగిలింది. నొప్పి కాదు నొప్పులు ఉన్నాయి. చాలా దెబ్బలు తగిలాయి. నాకు సెట్  అయ్యే అమ్మాయి ఇంకా దొరకలేదు. వెతుకుతూనే ఉన్నాను. 
 

55

రిలేషన్ షిప్ వర్క్ అవుట్ కాకపోతే బ్రేకప్స్ అవుతాయి. దాని నుండి బయటకు రావడానికి మరొక రిలేషన్ స్టార్ట్ అవుతుంది. నా బ్రేకప్స్ అన్నీ అంగీకారంతో జరిగినవే. కొందరితో ఇంకా ఫ్రెండ్షిప్ ఉంది. మాట్లాడుకుంటూనే ఉంటాము. సైకో లవర్స్ ని వదిలించుకోవడం కష్టం. అలాంటి వాళ్ళు కూడా నాకు తగిలారు.కొందరు జిడ్డులా పట్టుకొని వదలరు. అలాంటి వాళ్ళను వదిలించుకోవడం తప్పితే చేసేది ఏం లేదని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ హమీద ను శ్రీరామ చంద్ర ఇష్టపడ్డారు. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు వినిపించాయి. 

click me!

Recommended Stories