ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత..మావయ్య చిత్రాల రేంజ్ ఎవరికీ లేదు..నాగార్జున మూవీస్ లిస్ట్ చెబుతూ మేనల్లుడు సంచలనం

First Published | Aug 5, 2024, 12:24 PM IST

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున మావయ్యకి ఉన్న సినిమాల రేంజ్ ఇంకెవరికి లేదు. మా మావయ్య అని చెప్పడం లేదు కానీ ఇది నిజం. 

తండ్రి ఏఎన్నార్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోయారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే నాగార్జున వ్యాపారాల్లో సైతం రాణించారు. నాగార్జున తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్, సుశాంత్, నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 

ఓ ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ నాగార్జునని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునకి సుమంత్ మేనల్లుడు. నాగార్జున సోదరి కుమారుడే సుమంత్. కొంతకాలం హీరోగా రాణించిన నాగార్జున ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. హీరోగా కూడా వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటున్నారు. 


Nagarjuna-Amala

నాకు మావయ్యలో నచ్చే విషయం ఆయన జీవించే విధానం. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి ప్రాధాన్యత ఇస్తూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారు. అది నాకు చాలా ఇష్టం అని సుమంత్ తెలిపాడు. సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున మావయ్యకి ఉన్న సినిమాల రేంజ్ ఇంకెవరికి లేదు. మా మావయ్య అని చెప్పడం లేదు కానీ ఇది నిజం. 

ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఆ తరహాలో సినిమాల రేంజ్ ఉన్నది మావయ్యకే. శివ, గీతాంజలి, హలో బ్రదర్, అన్నమ్మయ్య, శ్రీరామ దాసు లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ అని సుమంత్  తెలిపారు. 

నాగార్జున తన కెరీర్ లో కమర్షియల్ చిత్రాలతో పాటు వైవిధ్యమైన చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అందుకే నాగార్జున కెరీర్ లో అన్ని రకాల చిత్రాలు ఉంటాయి. 

ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కుబేరలో నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

click me!