ఎందుకు ముంబయికి వెళ్లి అమ్మాయిలని తెచ్చుకుంటావు ? స్టార్ హీరోని సూటిగా అడిగిన మోహన్ బాబు.. సమాధానం ఇదే

సీనియర్ హీరో మోహన్ బాబు కూడా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. మనసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేస్తారు. కాస్త చనువు ఉన్న హీరోలని అయితే ముఖం మీదే అడిగేస్తారు.

సీనియర్ హీరో మోహన్ బాబు కూడా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. మనసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేస్తారు. కాస్త చనువు ఉన్న హీరోలని అయితే ముఖం మీదే అడిగేస్తారు. నాగార్జునకి, మోహన్ బాబుకి మంచి సాన్నిహిత్యం ఉంది. నాగార్జున గతంలో మంచు లక్ష్మి హోస్ట్ చేసిన షోలో పాల్గొన్నారు. 

ఈ ఇంటర్వ్యూలో నాగార్జునని అడగమని మోహన్ బాబు ఒక ప్రశ్న పంపారు. ఆ ప్రశ్నని మంచు లక్ష్మి.. నాగార్జునని అడిగింది. నాగార్జున ఎందుకు అమ్మాయిలని ముంబై నుంచి తెచ్చుకుంటాడు ? తెలుగులో ఎవరూ దొరకడం లేదా.. అంత అందమైన అమ్మాయిలు ఇక్కడ లేరా అని మోహన్ బాబు అడిగిన ప్రశ్న వినిపించింది. 


దీనికి నాగార్జున బదులిచ్చారు. ముంబై హీరోయిన్లతో చాలా కష్టం.. వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు. షూటింగ్ లో చాలా ఇబ్బంది ఉంటుంది. అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. కానీ తప్పడం లేదు. కానీ తెలుగులో అమ్మాయిలు ఎవరూ ముందుకు రావడం లేదు అని నాగార్జున అన్నారు. 

తెలుగులో అందమైన అమ్మాయిలు లేరు అని కాదు.. కానీ వాళ్ళు ఎందుకు ముందుకు రావడంలేదు తెలియడం లేదు. నాకు కనుక కూతురు ఉండి ఉంటే.. తనని నటిగా నేనే ఫస్ట్ ప్రమోట్ చేసేవాడిని అని నాగార్జున అన్నారు. 

అమ్మాయిలు మాత్రమే కాదు.. ఇప్పుడు వస్తున్నకొత్త తరం యువ నటులు కూడా నాకు నచ్చడం లేదు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ట్రై చేయడానికి ఇష్టపడడం లేదు అని నాగార్జున అన్నారు. 

తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే గీతాంజలి, శివ లాంటి ప్రయోగాలు చేశానని అన్నారు. ఇప్పుడు యువ నటుల్లో కొంతమంది మాత్రం అలా చేస్తున్నారు. అది కూడా వాళ్ళకి మరో ఛాయిస్ లేకపోవడం వల్ల అని నాగార్జున అన్నారు. 

Latest Videos

click me!