భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రంలో చిరంజీవి దొరబాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార చిత్రంలో జానపద కథని వశిష్ఠ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. రొటీన్ కి భిన్నంగా ఉండడంతో ఆడియన్స్ ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
Vishwambhara
ఇప్పుడు విశ్వంభర చిత్రం తెరకెక్కుతున్న విధానం చూస్తుంటే జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్ర వైబ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. తాజాగా వశిష్ఠ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర రిఫరెన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కానీ ఆ చిత్రానికి విశ్వంభరకి సంబంధం లేదు.
Vishwambhara
చిరంజీవి ఒక వైవిధ్యమైన చిత్రం చేసి చాలా రోజులు అవుతోంది. అలాగని సందేశాత్మక చిత్రం కాదు. కథ గమ్మత్తుగా ఉంటుంది. మర్వెల్ చిత్రాల తరహాలో స్టోరీ రూపొందించాం. చిరంజీవి టాప్ 3 చిత్రాలు తీసుకుంటే అందులో విశ్వంభర ఉంటుందని వశిష్ఠ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు.
విజువల్స్, యాక్షన్స్ సీన్స్, సెట్లు అన్నీ భారీగా ఉంటాయని వశిష్ఠ చెబుతున్నాడు. వశిష్ఠ చెప్పిన ఈ మాటలు మెగా అభిమానులని కుదురుగా ఉండనీయడంలేదు. విశ్వంభర చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
కాన్సెప్ట్ టీజర్ చూసినప్పుడు ఈ చిత్రం విశ్వం మొత్తానికి రిలేట్ అయి ఉందని హింట్ ఇచ్చారు. మరి సామాన్యుడైన దొరబాబు ఎలాంటి అద్భుతాలు చేసాడో తెలుసుకోవాలంటే విశ్వంభర రిలీజ్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.
డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రం గురించి ఇంతలా చెబుతుంటే.. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి బాబోయ్ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. విశ్వంభర చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తోంది.