రెండు కోట్లు ఎక్కువిస్తా శ్రీకాంత్ మాత్రం హీరోగా వద్దు.. `ఖడ్గం` సినిమా విషయంలో స్టార్‌ హీరోకి అవమానం

Published : Jun 23, 2025, 09:22 PM ISTUpdated : Jun 23, 2025, 09:25 PM IST

శ్రీకాంత్‌ హీరోగా నటించిన `ఖడ్గం` మూవీ అప్పట్లో పెద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో హీరోగా శ్రీకాంత్‌ వద్దు అని నిర్మాత రిజెక్ట్ చేశాడట. 

PREV
15
మినిమమ్‌ గ్యారంటీ హీరోగా శ్రీకాంత్‌

శ్రీకాంత్‌ మ్యాన్లీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఆయా సినిమాలతోనే స్టార్‌ హీరోగా ఎదిగారు. ఓ వైపు ఇతర హీరోల చిత్రాల్లో సెకండ్‌ హీరోగా చేస్తూనే మరోవైపు సోలో హీరోగా విజయాలు అందుకున్నారు. 

చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకీ లకు పారలల్‌గా మూవీస్‌ చేసి హిట్లు కొట్టారు. సెకండ్‌ రేంజ్‌ హీరోగా, జగపతిబాబు, జేడీ చక్రవర్తి, వేణు తొట్టెంపూడి, శివాజీ వంటి వారికి సమానంగా రాణించారు. 

ఇంకా చెప్పాలంటే బిగ్‌ స్టార్స్ కి తర్వాత ఆ రేంజ్‌లో క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్ కావడం విశేషం. ఆయన మూవీస్‌ వస్తున్నాయంటే మినిమమ్ గ్యారంటీ అనే నానుడి ఉండేది. అందుకే దర్శక, నిర్మాతలు శ్రీకాంత్‌ తోనే మూవీస్‌ చేసేందుకు ఆసక్తిని చూపించేవారు.

25
`ఖడ్గం` చిత్రంతో యాక్షన్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న శ్రీకాంత్‌

శ్రీకాంత్‌ ఫ్యామిలీ చిత్రాలు, లవ్‌ స్టోరీస్‌ చేస్తూనే మధ్య మధ్యలో యాక్షన్‌ మూవీస్‌ చేశారు. అలా చేసిన చిత్రమే `ఖడ్గం`. ఇది దేశ భక్తి ప్రధానంగా రూపొందిన చిత్రం. ఇండియాలో టెర్రరిస్ట్ లు ఎటాక్‌ ప్లాన్‌ చేస్తుంటారు. 

దాన్ని అడ్డుకోవడం కోసం మతాలకు అతీతంగా దేశం కోసం ఒక్కటి కావడం ఈ మూవీ కథ. ఇందులో శ్రీకాంత్‌తోపాటు రవితేజ, ప్రకాష్‌ రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో శ్రీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. 

రవితేజ నటుడిగా కనిపించాడు. సినిమా అవకాశాల కోసం ఆరాటపడే వ్యక్తి. ప్రకాష్‌ రాజ్‌ ముస్లీం పెద్దగా, బాగా పేరున్న వ్యక్తిగా, వీరికి సపోర్ట్ గా ఉండే వ్యక్తిగా నటించారు. 

ఈ మూవీకి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. కార్తికేయ బ్యానర్‌పై సుంకర మధు మురళీ నిర్మించారు. సోనాలీ బింద్రే, సంగీత హీరోయిన్లుగా నటించారు.

35
`ఖడ్గం` చిత్రంలో హీరోగా శ్రీకాంత్‌ రిజెక్షన్‌

2002లో `ఖడ్గం` మూవీ విడుదలైంది. ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. ఓ రకంగా ఈ మూవీ రేంజ్‌కి ఇది పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అని చెప్పాలి. ఈ మూవీతో శ్రీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, సీరియస్‌ రోల్‌లో అదరగొట్టాడు. 

ఆయనకిది కొత్త ఇమేజ్‌ని తీసుకొచ్చిన మూవీ అని చెప్పొచ్చు. యాక్షన్‌తో అదరగొట్టగలడు, నటుడిగానూ మెప్పించగలడు అని నిరూపించుకున్నారు. కృష్ణవంశీ కూడా శ్రీకాంత్‌ని ఓ కొత్త కోణంలో ఆవిష్కరించారు. 

అయితే ఇందులో శ్రీకాంత్‌ ని ఎంపిక చేసే విషయంలో పెద్ద రచ్చ నడిచిందట. చిత్ర నిర్మాత సుంకర మధు మురళీ శ్రీకాంత్‌ని హీరోగా వద్దు అన్నాడట. ఆయన్ని తీసేసి వేరే హీరోని పెట్టాలని ఒత్తిడి తెచ్చారట. అంతేకాదు శ్రీకాంత్‌ ముందే ఈ విషయాన్ని చర్చించుకున్నారట.

45
రెండు కోట్లు ఎక్కువిస్తా శ్రీకాంత్‌ బదులు జగపతిబాబుని తీసుకోండి

శ్రీకాంత్‌ అప్పటి వరకు ఫ్యామిలీ చిత్రాలు, ప్రేమ కథలు ఎక్కువగా చేయడంతో యాక్షన్‌ రోల్‌లో ఆయన్ని ఊహించుకోలేకపోయారు నిర్మాత. ఈ సినిమాకు ఆయన సెట్‌ కాడని దర్శకుడు కృష్ణవంశీ మొహంమీదే చెప్పాడట నిర్మాత. 

అంతేకాదు హీరోని మార్చండి, పెద్ద హీరోని తీసుకోండి, అవసరమైన రెండు కోట్లు ఎక్కువ బడ్జెట్‌ ఇస్తానని చెప్పాడట. జగపతిబాబుని తీసుకోవాలని చెప్పాడట. ఓ రకంగా శ్రీకాంత్‌కిది దారుణమైన అవమానం. తనముందే తనని వద్దు అని, జగపతిబాబుని తీసుకోవాలని చెబితే ఆయన చాలా హర్ట్ అయ్యారట. 

కానీ కృష్ణవంశీ మాత్రం శ్రీకాంత్‌ని నమ్మాడట. నిర్మాతతో ఫైట్‌ చేసి, తాను శ్రీకాంత్‌తో చేయించుకుంటాను, ఆయనలో ఆ పొటెన్షియల్‌ ఉంది, చేయగలడు అని చెప్పి, పట్టుబట్టి `ఖడ్గం`లో శ్రీకాంత్‌ని హీరోగా ఎంపిక చేశారు.

55
అవమానాన్ని ఛాలెంజ్‌ గా తీసుకున్న శ్రీకాంత్‌

కృష్ణవంశీ నమ్మకాన్ని నిలబెట్టాడు శ్రీకాంత్‌. ఆయన పోలీస్‌ పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్‌తో రెచ్చిపోవడమే కాదు, దేశభక్తి సీన్లలోనూ మెప్పించాడు. అదే సమయంలో లవ్‌ ట్రాక్‌లోనూ ఆకట్టుకున్నారు. అందరి మన్ననలు పొందారు. 

తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుని విమర్శకుల చేత ప్రశంసలందుకున్నారు. రిజెక్ట్ చేసిన నిర్మాత చేతనే శెభాష్‌ అనిపించుకున్నాడు. దీంతో ఈ మూవీ శ్రీకాంత్‌ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిందని చెప్పొచ్చు.

 అప్పట్లో ఇది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇలా తనకు జరిగిన అవమానాన్ని శ్రీకాంత్‌ బయటపెట్టాడు. ఓపెన్‌హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు శ్రీకాంత్‌. ఇప్పుడు ఆయన వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories