
సిల్క్ స్మిత పేరు వింటే ఆమె నటించిన వ్యాంపు పాత్రలే గుర్తుకు వస్తాయి. ఐటెమ్స్ సాంగ్స్ తోనూ ఒకప్పుడు సినిమాని ఉర్రూతలూగించింది. తెలుగులోనే కాదు, సౌత్ సినిమాని ఆమె శాసించింది.
తనదైన నటనతో, డాన్సులతో మంత్రముగ్దుల్ని చేసింది. గ్లామర్ హీరోయిన్‌గా విశేష గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ హీరోయిన్లు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మాత్రం కొందరు హీరోయిన్లు ప్రత్యేకంగా ఇలాంటి సాంగ్స్ చేసేవారు, వ్యాంపు పాత్రలతో ఆకట్టుకునేవారు.
అలా తనదైన డాన్సులతో మంత్రముగ్దుల్ని చేసిన సిల్క్ స్మిత కెరీర్ పరంగా పీక్‌ని చూసింది. డౌన్ చూసింది. చివరికి అనూహ్యంగా ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించడం విచారకరం.
నిరు పేద నుంచి డబ్బులపైనే నిద్రపోయేంత స్టేజ్‌కి ఎదిగిన సిల్క్ స్మిత జీవితం ఎంతో మందికి ఆదర్శం. అదే సమయంలో గుణపాఠం కూడా.
సిల్క్ స్మిత పూట గడవని స్థితి నుంచి వచ్చింది. అలాంటి పేదరికంలో మగ్గే కుటుంబంలో ఆమె జన్మించింది. ఇంట్లో పూటగడవడం లేదని చెప్పి వారి పేరెంట్స్ ఆమె చదువు మాన్పించి కూలీ పనికి పంపించారు.
ఇలా పొట్టకూటికోసం చేయరాని పనులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చిన్న వయసులోనే పెళ్లి చేశారు పేరెంట్స్. భర్త చిత్ర హింసలు పెట్టాడు. బాగా కొట్టేవాడట. దీంతో ఆ బాధలు తట్టుకోలేక అటు పుట్టింటిని, ఇటు మెట్టింటిని వదిలేసి మద్రాస్‌కి పారిపోయింది.
అక్కడ ఓ సినిమా సెలబ్రిటీ ఇంట్లో పనిమనిషిగా చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల కోసం ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు అవకాశాలు అందుకుంది. ఒక్కో ఛాన్స్ ని చేజిక్కించుకుని ఎదిగింది. అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది సిల్క్ స్మిత.
సిల్క్ స్మిత హీరోయిన్లకి టచప్ ఆర్టిస్ట్ గా చేసింది. అంతేకాదు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేసింది. ఆ తర్వాత సినిమాల్లో వ్యాంపు పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఐటెమ్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యింది.
ప్రారంభంలో మాత్రం చాలా మంది దర్శక, నిర్మాతలు ఆమెని రిజక్ట్ చేశారు. ఓ చిరంజీవి మూవీ నుంచి కూడా ఆమెని తీసేశారు. కొత్త కావడంతో డైలాగులు చెప్పడం రాట్లేదని ఆమెని తొలగించారు.
అందులో రైటర్, డైరెక్టర్ కనగాల జయకుమార్ ప్రమేయం కూడా ఉంది. అయితే ఒకటి రెండేళ్లు గడిచేనాటికి ఆమె రేంజే మారిపోయింది. సిల్క్ స్మిత కోసం నిర్మాతలు ఎగబడే పరిస్థితి వచ్చింది. అలా చిరంజీవి మూవీ కోసం ఆమెని తీసుకురావాల్సి వచ్చింది.
ఆ దర్శక, నిర్మాత సిల్క్ స్మితని కావాలని ఓ సాంగ్‌లో ఇరికించారట. అయితే ఆ సినిమా సెట్‌లో పెద్ద గొడవ అయ్యిందని, చిరంజీవి ఆమెని కొట్టాడని, దీంతో సిల్క్ స్మిత రచ్చ చేసిందని తెలిసింది. ఆ కథేంటో చూస్తే,
చిరంజీవి హీరోగా దర్శకనిర్మాత క్రాంతికుమార్ 1984లో `అగ్ని గుండం` చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సుమలత హీరోయిన్. ఈ మూవీలో సిల్క్ స్మిత ఉండాలని, ఆమె చేత ఓ సాంగ్ చేయించాలని క్రాంతికుమార్ భావించారు.
అందుకోసం ప్రత్యేకంగా సిల్క్ స్మితని ఎంపిక చేశారు. అయితే రైటర్‌గా ఉన్న జయకుమార్‌ని పిలిచి తనని గతంలో చిరంజీవి సినిమా నుంచి తీసేసిన విషయాన్ని గుర్తు చేసి ఆటపట్టించిందట.
అలా చాలా సార్లు ఆమె ఆయన్ని టీజ్ చేసేదట. అయితే ఓ రోజు షూటింగ్ జరుగుతుంది. అందులో చిరంజీవి సిల్క్ స్మితని కొట్టే సీన్ ఉంది. ఆ సన్నివేశంలో చిరంజీవిని చిన్నగా కొట్టమని ఆ రైటర్‌కి చెప్పిందట సిల్క్ స్మిత.
ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పారు జయకుమార్. ఆమె అన్న విషయం దర్శకుడు క్రాంతికుమార్ వరకు వెళ్లింది. వాళ్ల మధ్య ఏదో డిస్కషన్ జరిగింది.
ఇక ఫైనల్‌గా ఆ సీన్ షూటింగ్ జరుగుతుంది. అందులో చిరంజీవి సిల్క్ స్మితని గట్టిగానే కొట్టాడట. దెబ్బకి అరుస్తూ కిందపడిపోయిందట. సెట్‌లో అంతా కంగారు పడ్డారు. షూటింగ్ ఆపేశారు.
అసిస్టెంట్లు సిల్క్ స్మితని చెంపదెబ్బకి ఆవిరి పెట్టారట. ఆమెని కూల్ చేశారట. అయితే సిల్క్ స్మిత మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకోలేదు. ఆమె షూటింగ్ చేసేందుకు మొరాయించింది. దీంతో ప్యాకప్ చెప్పే పరిస్థితి వచ్చిందట.
ప్యాకప్ చెబితే నష్టం, సిల్క్ స్మిత సపోర్ట్ చేయకపోతే సినిమాకి పెద్ద నష్టం, ఆమె పాత్రని మరొకరు బ్యాలెన్స్ చేయడం కష్టం. దీంతో దర్శకుడు క్రాంతికుమార్, అసిస్టెంట్లు అంతా కలిసి చిరంజీవి వద్దకు వెళ్లి బతిమాలుకున్నారు.
దీంతో సినిమా కోసం చిరు కూడా తగ్గారు. వెళ్లి సిల్క్ స్మితని సారీ చెప్పడంతో ఆమె షూటింగ్‌కి సపోర్ట్ చేసిందట. ఈ విషయాన్ని రైటర్, డైరెక్టర్ కనగాల జయకుమార్ తెలుగు వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయం అందరికి ఆసక్తిని రేకెత్తిస్తోంది.