Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?

Published : Dec 21, 2025, 08:52 PM IST

Sanjjanaa Galrani: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. తనకి హీరోయిన్ గా నటించిన సంజననే హీరో శ్రీకాంత్ ఎలిమినేట్ చేశారు.

PREV
14
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. తనకి హీరోయిన్ గా నటించిన సంజననే హీరో శ్రీకాంత్ ఎలిమినేట్ చేశారు. టాప్ 5 లో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని నాగార్జున శ్రీకాంత్ కి అప్పగించారు. తాను బిగ్ బాస్ షోకి పెద్ద అభిమానిని అని ప్రతి ఎపిసోడ్ చూస్తానని శ్రీకాంత్ అన్నారు. నాగార్జున అప్పగించిన బాధ్యత ప్రకారం టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు శ్రీకాంత్ హౌస్ లోకి వెళ్లారు. 

24
సెలెబ్రిటీలు అయిపోయారు 

టాప్ 5 లో ఉన్న ఒక్కొక్కరి గురించి శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా మాట్లాడారు. తనూజ తెలుగింటి అమ్మాయిలా ఉందని, ఆమె ఎమోషన్స్ చాలా జెన్యూన్ గా ఉన్నాయని అన్నారు. కామనర్స్ గా వచ్చిన డిమాన్ పవన్, కళ్యాణ్ ఇద్దరూ సెలెబ్రిటీలు అయిపోయారని ప్రశంసించారు. ఇక సంజనతో తాను దుశ్శాసన అనే చిత్రంలో నటించానని.. ఎవ్వరితోనూ మాట్లేడేది కాదు. చాలా సైలెంట్ గా ఉండే అమ్మాయి. అలాంటి అమ్మాయి బిగ్ బాస్ షోకి వెళుతుందని తెలిసి షాక్ అయ్యా. 

34
మూడో వారంలోనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నా 

ఆమె తప్పకుండా 2 వారం లేదా మూడో వారంలో బయటకి వచ్చేస్తుంది అని అనుకున్నా. కానీ టాప్ 5 వరకు రావడం షాకింగ్ అని శ్రీకాంత్ అన్నారు. అదే విదాంగా ఇమ్మాన్యుయేల్ కామెడీని బాగా ఎంజాయ్ చేసినట్లు శ్రీకాంత్ తెలిపారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. టాప్ 5 అందరికీ వైట్ షర్ట్స్ ఇచ్చి వేసుకోమని చెప్పారు. 

44
సంజన అవుట్ 

ఆ షర్ట్స్ పై ఎవరు సేఫ్ అయితే వాళ్లకు సేఫ్ అని, ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఎలిమినేట్ అని రాస్తానని చెప్పారు. కానీ అందరినీ టెన్షన్ పెట్టి ట్విస్ట్ ఇచ్చారు. అందరికీ సేఫ్ అనే రాశారు. తర్వాత వారిని గార్డెన్ వద్దకు తీసుకుని వెళ్లారు. బ్యాండ్ మేళం తో కొందరు వచ్చారు. అప్పుడే సంజన ఎలిమినేట్ అయినట్లు రివీల్ చేశారు. ఆ విధంగా తనకి హీరోయిన్ గా నటించిన సంజననే శ్రీకాంత్ ఎలిమినేట్ చేయడం విశేషం. 

Read more Photos on
click me!

Recommended Stories