Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం

Published : Dec 21, 2025, 08:16 PM IST

Bigg Boss Telugu 9 Winner Kalyan Padala : అంతా అనుకున్నట్టు జరిగింది. చాలా కాలంగా ప్రచారంజరుగుతునట్టు పవన్ కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచి టైటిల్ గెలిచాడు. సామాన్యుడు బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఇది రెండో సారి. 

PREV
15
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..

సెప్టెంబర్ 10 న స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. విజయవంతంగా పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలే కు చేరుకుంది. ఈక్రమంలో టైటిల్ విన్నర్ ఎవరై ఉంటారు అని ఆడియన్స్ లో ఉత్కంఠ కొనసాగింది. హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గా కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, సంజన లు ఉండగా.. వీరిలో విన్నర్ గా ఎవరు గెలుస్తారా అని చివరి వారంలో బిగ్ బాస్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు. కళ్యాన్ పడాల, తనూజ మధ్య హోరా హోరీ పోరు కొనసాగిన క్రమంలో.. చివరివారం డీమాన్ పవన్ కూడా టైటిల్ రేస్ లోకి వచ్చాడు. కానీ అనూహ్యంగా.. అందరూ అనుకున్న విధంగా కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచినట్టు తెలుస్తోంది.

25
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల..?

చాలా రోజులుగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ పై రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. అయితే ఎక్కువమంది విన్నర్ ఎవరు అవుతారు అంటే కళ్యాణ్ పడాల వైపే మొగ్గు చూపారు. కాకపోతే తనూజ కూడా అవుతుందేమో అన్న చిన్న అనుమానం కూడా అందరిలో ఉంది. కాగా అందరు అనుకున్నట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ గా పవన్ కళ్యాణ్ పడాల గెలిచినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ టైటిల్ విన్నర్ గా ట్రోఫీని అందుకున్నాడని సమాచారం. ఈ వీక్ లో తనూజ టఫ్ కాంపిటేషన్ ఇచ్చినా.. చివరికి కళ్యాణ్ గెలిచి నిలిచినట్టు తెలుస్తోంది. అయితే సామాన్యుడు ఇలాటైటి్ గెలవడం ఇది రెండో సారి. గతంలో బిగ్ బాస్ తెలుగు  సీజన్ 7 విన్నర్ గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ కప్ ను గెలిచాడు. ఆతరువాత కళ్యాణ్ కప్ గెలిచి మరోసారి సంచలనంగా మారినట్టు తెలుస్తోంది. 

35
గట్టి పోటీ ఇచ్చిన తనూజ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ వీక్ ఓటింగ్ పవన్ కళ్యాణ్, తనూజ మధ్యే జరిగింది. డీమాన్ పవన్ కూడా మధ్యలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి.. పోటీగా వచ్చినా.. అతను ఎక్కువ రోజులు నిలబడలేకపోయాడు. కళ్యాణ్ ను, తనూజను దాటి అతను ఓటింగ్ ను సాధించలేకపోయాడు. కానీ తనూజ మాత్రం కళ్యాణ్ దాటుకుని కొన్ని సందర్భాల్లో ముందుకు వచ్చింది. ఆమె ఓటింగ్ కళ్యాణ్ ను దాటేసింది. ఆతరువాతి క్రమంలో తనూజను దాటుకుని కళ్యాణ్ ఓటీంగ్ అమాంతం పెరిగిపోయింది. కళ్యాణ్ పడాలకు 40 శాతం పైగా ఓటింగ్ నమోదు అవ్వగా.. తనూజకు 35 శాతం వరకూ వచ్చినట్టు సమాచారం. 27 శాతం డీమాన్ కు, 25 శాతం ఇమ్మాన్యుయేల్ కు, 20 లోపు సంజనకు ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది.

45
తనూజ టైటిల్ విన్నర్ అంటూ ప్రచారం..

అయితే తనూజ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇవ్వడంతో.. ఆమెనె విన్నర్ గా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఇద్దరిలో కాస్త ఓటింగ్ తేడా ఉన్నా.. ఈసారి తనూజను టైటిల్ వరిస్తుంది అనుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన 8 సీజన్లలో ఆడవారు ఎవరు కప్ గెలవలేదు. శ్రీముఖి విన్నింగ్ కప్ కు చాలా దగ్గరగా వచ్చింది కానీ.. రన్నర్ గానే మిగిలిపోయింది. దాంతో ఈసారి కప్ తనూజకే ఇవ్వాలని బిగ్ బాస్ టీమ్ కూడా అనుకున్నట్టు టాక్ వినిపించింది. కానీ అన్ని రకాలుగా ఆడియన్స కళ్యాణ్ వైపే ప్రెజర్ ఉండటం, ఓటింగ్ లో కూడా కళ్యాణ్ దూసుకుపోవడంతో.. బిగ్ బాస్ విన్నర్ గా కళ్యాణ్ పడాలను నిర్ణయించారట టీమ్.

55
ఎవరీ కళ్యాణ్ పడాల...

బిగ్‌బాస్ తెలుగు 9 అగ్నిపరీక్షలో అందరిని ఆకట్టుకుని.. టఫ్ ఫైట్‌లో గెలిచి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్ పడాల. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా సేవలందిస్తున్నాడు. మూడేళ్లుగా సోల్జర్‌గా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కామనర్స్ ప్రోగ్రామ్‌‌కు దరఖాస్తు చేసుకున్న ఇతను టఫ్ పోరులో గెలిచాడు. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ఫిజికల్ గేమ్స్‌తో పాటు మైండ్ గేమ్‌లోనూ సత్తా చాటి హౌస్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో కూడా తనదైన గేమ్ తో ఆకట్టుకున్నాడు. తన యాటీట్యూడ్ తో అందరి దృష్టిని ఆకర్శించాడు.సామన్యుల కోటాలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ టైటిల్ ను సాధించాడు.

Read more Photos on
click me!

Recommended Stories