Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్

Published : Dec 21, 2025, 07:50 PM IST

Demon Pavan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్రారంభమైంది. టాప్ 5లో ఉన్న సభ్యుల మధ్య హౌస్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో డిమాన్ పవన్ జాక్ పాట్ కొట్టారు. 

PREV
13
బిగ్ బాస్ తెలుగు 9

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్రారంభమైనది. కింగ్ నాగార్జున రాయల్ ఎంట్రీ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ డయాస్ పై సందడి చేశారు. టాప్ 5 లో ఉన్న కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, డిమాన్ పవన్ అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ తో ఎంట్రీ ఇచ్చారు. విజేత ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది. 

23
జాక్ పాట్ కొట్టిన డిమాన్ 

పవన్  ఇదిలా ఉండగా ముందుగా అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ విన్నర్ రేసు నుంచి డిమాన్ పవన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. టాప్ 5 నుంచి ఇప్పటికి ఇప్పుడు తప్పుకుంటే రూ. 15 లక్షలు ఇస్తాం అని ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కి డిమాన్ పవన్ అంగీకారం తెలిపారు.

33
విన్నర్ రేసు నుంచి అవుట్ 

 దీనితో 15 లక్షలు తీసుకుని పవన్ విన్నర్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఇది డిమాన్ కి జాక్ పాట్ అనే చెప్పాలి. ఒక్క దెబ్బకి 15 లక్షలు అంటే మాటలు కాదు. విన్నర్ రేసులో పవన్ లేడు. టాప్ 3 లేదా టాప్ 4 లో ఉంటాడు. కాబట్టి పవన్ తీసుకున్నది తెలివైన నిర్ణయమే అని అంటున్నారు. ఈ సీజన్ లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో డిమాన్ ఒకరు. రీతూతో ఎఫైర్, గేమ్స్ లో గట్టిగా పోరాడడం లాంటి అంశలతో డిమాన్ హంగామా చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories