Intinti Gruhalakshmi: తండ్రి కోసం కష్టపడుతున్న దివ్య.. లాస్యకు షాకిచ్చిన భాగ్యం?

First Published Jun 9, 2023, 8:46 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కష్టాల్లో ఉన్న తన మాజీ భర్తకి న్యాయం చేయాలని పోరాడుతున్న ఒక మాజీ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో దీపక్ దివ్యకి ఫోన్ చేసి తన తండ్రి కేసు రిఓపెన్ చేస్తున్నట్లుగా చెప్తాడు. అందుకు దివ్య సంతోషిస్తుంది కానీ దీపక్ తో మాత్రం ఈ మాట మా అమ్మ నాతో చెప్పి ఉంటే నేను సంతోషించేదాన్ని ఇదే విషయాన్ని మీరు మా అమ్మకు చెప్పండి. తను నామీద ఎందుకు కోప్పడుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. మా అత్తగారింట్లో కూడా అన్ని రెస్ట్రిక్షన్స్ లేవు అని చెప్తుంది దివ్య. ఫోన్ పెట్టేసిన తర్వాత విన్నావు కదా దాని మాటలు.
 

దాని బాధ గుండె లోతుల్లోంచి వస్తుంది. నువ్వే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటాడు దీపక్. తన మాట ఒకసారి వింటే పరిగెట్టుకొని వెళ్ళిపోతాను అది తన కాపురానికే మంచిది కాదు అని కన్నీరు పెట్టుకుంటుంది తులసి. మరోవైపు దివ్య, విక్రమ్ ఇద్దరూ ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకుంటారు. జరిగిందాన్ని ఇంత తొందరగా మరిచిపోతావనుకోలేదు నీ మీద నమ్మకంతోనే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అంటాడు విక్రమ్.
 

ముందరకాళ్ళకి బంధం వేస్తున్నావా అని అడుగుతుంది దివ్య. అలాంటిదేమీ లేదు నువ్వు ఒక పూజ చేయాలి. ఇంట్లో అరిష్టం ఉందంట అది నీ వల్లే వచ్చిందంట.. నువ్వు ఇంట్లో కాలు పెట్టిన వేళవిశేషం మంచిది కాదంట అందుకే నువ్వే పూజ చేయాలి. అలా అని పంతులుగారు చెప్పారంట ఇలా చేస్తే మా అమ్మకి ప్రాణహాని ఉండదు.. మీ నాన్నగారికి కూడా చాలా మంచిదంట అంటాడు విక్రమ్.
 

పంతులు గారు చెప్పారు అనేసరికి దివ్య మనసులో అనుమానం మొదలవుతుంది. ఛీ.. ఏం తల్లి.. కొడుకు ఎమోషన్స్ తో ఆడుకుంటుంది అంటూ రాజ్యలక్ష్మి ని అసహ్యించుకుంటుంది. బయటికి మాత్రం నీకోసం నేను ఈ పూజ చేస్తాను ధైర్యంగా ఉండు అని చెప్తుంది. మరోవైపు సాక్షి కనిపించకపోవడంతో కంగారుపడుతుంది తులసి. అంతలోనే శేఖర్ ఫోన్ చేసి నేను కోర్టుకు వస్తున్నాను కంగారు పడొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
 

అదే విషయాన్ని దీపక్ తో చెప్పి సంతోషంగా ఇద్దరూ కోర్టుకు బయలుదేరుతారు. మరోవైపు పూజ కోసం అంతా సిద్ధం చేస్తారు పంతులుగారు. మీ వీడియో నా దగ్గర ఉందని తెలిసి కూడా మళ్ళీ ఇలాంటి వేషాలు వేస్తున్నారు ఏంటి అని పంతులు గారిని మెల్లగా అడుగుతుంది దివ్య. ఇలా చేయకపోతే ప్రాణం తీసేస్తానన్నారు తప్పక చేస్తున్నాను అంటూ తలదించుకుంటారు పంతులుగారు.
 

108 బిందెలతో అభిషేకం చేస్తే మీకు ప్రాణహాని ఉండదు ఆమె తండ్రికి కూడా చాలా మంచిది అంటారు పంతులుగారు. ఒక్కసారిగా షాక్ అవుతాడు విక్రమ్. ఆమె బదులు నేను చేయొచ్చు కదా అని అడుగుతాడు. భార్య తరపున భర్త చేయవచ్చు అండి ఒకసారి చూడండి అని విక్రమ్ తాతయ్య కూడా చెప్తాడు. రాజ్యలక్ష్మి సైగ చేయడంతో కుదరదు దోషం ఆమె వల్ల కాబట్టి ఆమె పూజ చేయాలి అంటారు పంతులుగారు.
 

రాజ్యలక్ష్మి బయటకు మాత్రం నా ప్రాణానికి ఏమైనా పర్వాలేదు కానీ దివ్య నీళ్ళతో అభిషేకం చేస్తే నేను చూడలేను తను చిన్నపిల్ల అంటూ తెగ నటిస్తుంది. కానీ దివ్య మాత్రం అభిషేకం చేయటానికి నిశ్చయించుకుంటుంది. దేవుడికి దండం పెట్టుకుంటూ ఇది మా అత్తగారి కోసం చేస్తున్నది కాదు మా నాన్నని ఆ గండం నుంచి గట్టెక్కిస్తావని చేస్తున్నాను అంటూ అభిషేకం ప్రారంభిస్తుంది దివ్య. 50 బిందెల అభిషేకం పూర్తయిన తర్వాత బాగా నీరసపడిపోయిన దివ్యని చూసి అత్తగారి కోసం ఎంత కష్టపడుతుందో తనని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అనుకుంటాడు విక్రమ్. 

మొత్తానికి మీ అక్కయ్య పెద్ద కోడలికి చుక్కలు చూపిస్తుంది అంటూ భర్తతో చెప్తుంది బసవయ్య భార్య. మరోవైపు అందరూ కోర్టుకి చేరుకుంటారు. నందు దగ్గరికి వచ్చిన తులసి మిమ్మల్ని బయటకి తీసుకు వెళ్తాను ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. తన మాటలు నమ్మకు నిన్ను నిలువునా ముంచేస్తుంది. నేను చెప్పినట్లు విను నిన్ను నిమిషాల్లో బయటకు తీసుకు వస్తాను అంటుంది లాస్య. ఆయన ఎవరిని నమ్మి మునిగిపోయారు బాగా తెలుసు అంటుంది తులసి. నువ్వు ఎంత తెగించి ఉన్నావు నేను అంతకన్నా ఎక్కువ తెగించి ఉన్నాను అంటూ ఆవేశంగా మాట్లాడుతాడు నందు.

తరువాయి భాగంలో లాస్యకి విరుద్ధంగా సాక్ష్యం చెప్తాడు శేఖర్. అతను చెప్పింది నిజమే అందుకు నేనే సాక్ష్యం అంటూ భాగ్యం సాక్ష్యం చెప్తుంది. నావల్ల తప్పైపోయింది నన్ను క్షమించండి అని వేడుకుంటుంది లాస్య. ఇలాంటి మనిషితో కలిసి కాపురం చేయలేను డైవర్స్ ఇప్పించమని వేడుకుంటాడు నందు.

click me!