అదితి తో కలిసి తిరుగుతున్న సిద్ధార్థ్.. భార్యను ఎందుకు వదిలేశాడో తెలుసా..?

Published : Jan 07, 2024, 03:08 PM ISTUpdated : Jan 07, 2024, 03:15 PM IST

హీరోయిన్ అదితీని వెంటేసుకుని తిరుగున్న హీరో సిద్దార్ధ్ తన మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చాడోతెలుసా..? అసలు ఆమె ఎవరో తెలుసా..?   

PREV
16
అదితి తో కలిసి తిరుగుతున్న సిద్ధార్థ్.. భార్యను ఎందుకు వదిలేశాడో తెలుసా..?

హీరో సిద్ధార్థ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు.  అవ్వడానికి తమిళ హీరో అయినా.. తెలుగు స్పస్టంగా మాట్లాడుతూ.. తెలుగు కుర్రాడే అనిపించుకున్నాడు సిద్దార్ధ్. టాలీవుడ్‌ ప్రేక్షకులకు బొమ్మరిల్లు సిద్దు గా తెలిసిన ఈ హీరో.. ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఎంతోమంది అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. టాలీవుడ్ లో చాలా హిట్ సినిమాలు చేశాడు. అందుకే సిద్దు గురించి  పెద్దగా ఇంట్రడక్షన్‌ అవసరం లేదు. 

26

 బొమ్మరిల్లు తో మొదలు పెట్టి..  నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు, బావా లాంటి  సినిమాలతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. బొమ్మరిల్లు హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న సిద్దార్థ్‌ టాలీవుడ్ పై చేసిన కొన్నివ్యాఖ్యల కారణంగా ఇక్కడ ఇమేజ్ ను డామేజ్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో ఫామ్ నుకోల్పోయాడు

36

ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సిద్ధార్థ్ కొంతకాలం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ చెన్నైకి చెందిన వ్యక్తి. ఇతను తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషాచిత్రాల్లో కూడా సినిమాలు చేశాడు.ఇక ఇఫ్పుడిప్పుడే తెలుగులో సినిమాలు మొదలు పెట్టాడుసిద్దు. కాని ఏం లాభం లేదు.. ఏ సినిమా చేసినా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈక్రమంలో సిద్దు రీ ఎంట్రీలో.. మహా సముద్రం లాంటి మూవీస్ తో ముందుకు వచ్చాడు. ఈసినిమా డిజాస్టర్ అయినా.. సిద్దుకు టాలీవుడ్ లోకి రూట్ క్లియర్ చేసింది. 
 

46

ఇక సిద్ధార్థ్ వ్యక్తిగత విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సిద్దుకు ఇంతకు ముందే పెళ్లైఓ కొడుకు కూడా ఉన్నాడు. కాని ఈ విషయం చాలా మందికి తెలియదు. 2003 సంవత్సరంలోనే సిద్ధార్థ్ తన ఎదురింట్లో ఉంటున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతే కాదు వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. కాని వీరిమధ్య  బంధం  మాత్రం ఎక్కువకాలం నిలవలేకపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహమైన మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు.

56

వీరు విడాకులు తీసుకునే సమయానికి వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. విడాకుల తరువాత తన కొడుకు బాధ్యలతను తానే చూసుకుంటున్నాడు సిద్దు. కొడకును చూసుకుంటున్నాడు కాని సిద్దు ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు. కాని కొంత మంది హీరోయిన్లతో డేటింగ్ మాత్రం చేస్తున్నాడు. గతంలో సమంతతో పెళ్లి వరకూ వెళ్ళిన విషయం.. ఆతరువాత ఎందుకో బ్రేకప్ అయ్యిందని టాక్. ఇక తాజాగా సిద్దు.. హీరోయిన్ అదితీరావు తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు.
 

66
Aditi Rao Hydari And Siddharth

త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని టాక్ గట్టిగా నడుస్తోంది. కానిఇంత వరకూ వీరు ఈ విషయంలో స్పందించలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ కలిసి జంటగా తిరుగుతున్నారు. ముఖ్యంగా ఈన్యూ ఇయర్ ను లండన్ లోఏకాంతంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈజంట. ఫారెన్ లో తెగ సందడి చేసి వచ్చారు. అంతే కాదు ఇక్కడ ఉన్నా కూడా.  ఫంక్షన్స్ కి, సినిమాలకి, పార్టీలకి కలిసి వెళ్తున్నారు. దీంతో వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి వీరి బంధం గురించి ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారో లేదో. 

click me!

Recommended Stories