శర్వానంద్ పేరెంట్స్ బాగా స్థితిమంతులు అట. వీరిది బిజినెస్ ఫ్యామిలీ అని సమాచారం. హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్ళినా శర్వానంద్ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉంటాయట. ఒక సన్నిహితుడితో కారులో హైదరాబాద్ లో సంచరిస్తూ.. ఆ స్థలం మాదే, ఈ ఇల్లు మాదే అంటూ... పలు ఏరియాల్లో ఉన్న తమ ఆస్తులు చూపించాడట శర్వానంద్.
ఈ విషయాన్ని గతంలో శర్వానంద్ ని ఓ జర్నలిస్ట్ నేరుగా అడిగారు. హైదరాబాద్ లో ప్రతి మూలన మీకు ఆస్తులు ఉన్నాయట. అసలు సగం హైదరాబాద్ మీదేనట? అని అడగ్గా... శర్వానంద్ నవ్వుతూ సమాధానం చెప్పారు. సగం హైదరాబాద్ కొనేంత ఆస్తులు లేవు కానీ... మాకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నమాట వాస్తవమే అన్నాడు. అయితే ఎంత సంపన్న కుటుంబంలో పుట్టినా కూడా, టీనేజ్ నుండి నా ఖర్చులకు నేను సంపాదించుకునేవాడిని, ఫ్యామిలీ మీద ఆధారపడటం నచ్చదు.. అన్నాడు.