హైదరాబాద్ లో చరణ్ బర్త్ డే వేడుకలు ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. చరణ్ బర్త్ డే వేడుకలో ఫ్యాన్స్ తో పాటు పాల్గొన్న సాయి ధరమ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెగా ఫ్యామిలీ పై కొందరు చాలా కాలంగా విషం చిమ్ముతున్నారని, ద్వేషంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వేదిక ఏదైనా చాలా సౌమ్యంగా మాట్లాడే ధరమ్ ఒకింత ఆవేశపూరిత ప్రసంగం చేయడం, ఆసక్తికరంగా మారింది.
గతంలో మామయ్య చిరంజీవి బర్త్ డే వేడుకలు చూశాను , మరలా ఆ స్థాయిలో చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ చూస్తున్నాను అన్నారు ఆయన.
ఇక మీకు ఒక కథ చెబుతా.. ఓ ప్రదేశంలో ఓ మామిడి చెట్టు ఉంది. దాని నిండా కాయలు ఉన్నాయి. అక్కడ ఉన్న పిల్లలకు పోటీ పెడుతూ... ఎవరు ముందు వెళ్లి ఆ చెట్టు కాయలు కొస్తే మొత్తం కాయలు వారికే అని చెప్పారు.
ఆ పిల్లలలో కొందరు బాగా పరిగెత్తే వాళ్లు ఉన్నారు. కొందరు అసలు పరిగేయలేని వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎవరు ఆ కాయలు సొంతం చేసుకుంటారని అనుకుంటున్న సమయంలో.. అందరూ ఒకేసారి ఆ చెట్టు వద్దకు చేరి పళ్ళు కోసుకున్నారు.
ఆ చెట్టు మెగాస్టార్ చిరంజీవి అయితే.. ఆ పళ్లు కోసుకున్న పిల్లలం మేము... అని మెగా హీరోలను ఉద్దేశించి ధరమ్ అన్నారు.
ఇక మెగా కుటుంబంపై విమర్శలు చేసేవారు చాల మంది ఉన్నారని, వారు తమపై విషం కురిపిస్తున్నారు. కానీ వారెవరు మెగా ఫ్యామిలీని ఏమీ చేయలేరు అన్నారు ధరమ్.
మెగా ఫ్యాన్స్ ఉన్నత కాలం తమను ఎవరు ఏమీ చేయలేరన్న ధరమ్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ని ప్రేమిస్తూనే ఉంటారని తెలియజేశాడు. మరి ధరమ్ వార్నింగ్ ఇచ్చిన సదరు వ్యక్తులు ఎవరని అందరూ ఆలోచనలో పడ్డారు.