Rajaskhar Mistakes: వాటివల్లే రాజశేఖర్‌ కెరీర్‌ డౌన్‌?, లేదంటే ఇప్పటికీ సూపర్‌ స్టార్‌గా వెలగాల్సిన హీరో

Published : Feb 04, 2025, 01:15 PM IST

Rajaskhar Mistake: హీరో రాజశేఖర్‌ తన కెరీర్‌లో ప్రధానంగా రెండు మిస్టేక్స్ చేశారు. ఇద్దరు ప్రముఖులతో ఆయన గొడవలకు వెళ్లారు. దీంతో ఆ ప్రభావం ఆయన కెరీర్‌పై పడింది   

PREV
16
Rajaskhar Mistakes: వాటివల్లే రాజశేఖర్‌ కెరీర్‌ డౌన్‌?, లేదంటే ఇప్పటికీ సూపర్‌ స్టార్‌గా వెలగాల్సిన హీరో

టాలీవుడ్‌ టాప్‌ హీరోగా రాణించిన రాజశేఖర్‌ ప్రస్తుతం కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతున్నారు. సినిమా జీవితం సాఫీగా సాగడం లేదు. చేసిన సినిమాలు విఫలం కావడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఇప్పుడు నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ధైర్యం చేయడం లేదు.

ఈ క్రమంలో ఆయన ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే రాజశేఖర్‌ కెరీర్‌ డౌన్‌ కావడానికి కారణం ఏంటి? అనేది చూస్తే రెండు మిస్టేక్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. 

26

రాజశేఖర్‌ యాక్షన్‌ హీరోగా రాణిస్తున్న సమయంలో ఆయన రూట్‌ మార్చారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. యాంగ్రీమ్యాన్‌లో ఫన్‌, రొమాన్స్ సైడ్‌ని ఓపెన్‌ చేశారు. `అల్లరి ప్రియుడు` సినిమాతో రాజశేఖర్‌ ఇమేజ్‌ని మార్చేశాడు.

ఆ తర్వాత వరుసగా రొమాంటిక్‌, కామెడీ సినిమాలు చేశారు రాజశేఖర్‌. అలాంటి సినిమాలతో దర్శకులు కూడా క్యూ కట్టారు. దీంతో రాజశేఖర్‌ ఇమేజ్‌ కంప్లీట్‌గా మారింది. ఆ తర్వాత రాఘవేంద్రరావుతో `రాజ సింహం` మూవీ చేశారు రాజశేఖర్‌. ఈ మూవీ యావరేజ్‌గానే ఆడింది. 
 

36

కానీ అంతలోనే పెద్ద గొడవ. దర్శకుడు రాఘవేంద్రరావు మీదకు గొడవకు వెళ్లాడు రాజశేఖర్‌. ఆవేశంలో తాగి ఆయన్ని కొట్టడానికి వెళ్లాడట. దీనికి కారణం తన మరదలు. రాజశేఖర్‌ మరదలు షూటింగ్‌లకు వచ్చేది. చూడ్డానికి తను కూడా హీరోయిన్‌ లాగా ఉండేది. అయితే రాఘవేంద్రరావుతో క్లోజ్‌గా ఉండేదట.

అంతేకాదు ఆయన కోసం షూటింగ్‌లకు వెళ్లిందని, పర్సనల్‌గానూ కలిసిందని రాశేఖర్‌కి తెలిసింది. అంతే తన మరదలికి సినిమా ఆఫర్లు చూపించి దగ్గర చేసుకునే ప్రయత్నం చేశాడని రాజశేఖర్‌ భావించారు. ఓ రోజు బాగా తాగి రాఘవేంద్రరావుని కొట్టడానికి వెళ్లాడట. 
 

46

ఆయన ఇంటిముందు పెద్ద గొడవ చేశాడట. బూతులు కూడా తిట్టుకున్నారు. దీంతో రాఘవేంద్రరావు బాగా హర్ట్ అయ్యాడు. అప్పట్నుంచి రాజశేఖర్‌ని దూరం పెట్టాడు. అయితే ఆ తర్వాత నిజం తెలుసుకున్నాడు రాజశేఖర్‌. తన మరదలి విషయంలో ఆయన తప్పేమీ లేదని ఆయనకు తెలిసింది.

దీంతో రాజీ ప్రయత్నం కోసం చాలా మందిని కలిసినా ప్రయోజనం లేదు. దీంతో తానే స్వయంగా ఓ రోజు జరిగిన విషయం చెప్పి, రాఘవేంద్రరావుకి క్షమాపణలు చెప్పాడు రాజశేఖర్‌. ఎంత చెప్పినా, ఆ తర్వాత ఇద్దరు ఫ్రీ కాలేకపోయారు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో సినిమాలు చేసే అవకాశం రాలేదు.

అలా రాఘవేంద్రరావుతో సినిమాలు చేసే అవకాశం కోల్పోయాడు రాజశేఖర్‌. ఒకవేళ ఆయనతో సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు ఆయన కెరీర్‌ వేలేలా ఉండేదని, ఇప్పటికీ సూపర్‌ స్టార్‌గా వెలిగినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. 
 

56

దీంతోపాటు మరో బిగ్‌ మిస్టేక్‌ జరిగింది. చిరంజీవి విషయంలోనూ గొడవ జరిగింది. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు, మద్దతు కోరినప్పుడు రాజశేఖర్‌ ఇవ్వలేదు. అది సరికదా పలు విమర్శలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌పై కూడా విమర్శలు చేశారు. చిన్న చిన్న అపర్థాలు పెద్దగా మారాయి. ఇద్దరి మధ్యదూరం పెంచాయి. పెద్ద గొడవలకు దారితీసింది.

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ విషయంలోనూ రాజశేఖర్‌ కామెంట్స్ వివాదం అయ్యాయి. ఇది కూడా కేసు అయ్యింది. ఇలా చిరంజీవితోనూ గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత నుంచి రాజశేఖర్‌కి విజయాలు దక్కినా, కెరీర్‌కి ఉపయోపడే పెద్ద పెద్ద దర్శకులు, అలాంటి కథలు తగ్గిపోయాయి. ఈ గొడవ పరోక్షంగా రాజశేఖర్‌ కెరీర్‌పై ప్రభావం పడింది. 

66

హీరోగా రాజశేఖర్‌కి తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ ఉంది. స్టార్‌ స్టేటస్‌ ఉంది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకీలకు దీటుగా హీరోగా రాణించారు. స్టార్‌గా వెలిగారు రాజశేఖర్‌. కానీ తనలోని ఆవేశం, తొందరలో నోరు జారడం వంటి వాటి కారణంగా ఇబ్బంది పడుతూ, వివాదాల్లో నిలుస్తూ చివరికి కెరీర్‌నే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు.

ఇప్పుడు హీరోగా సర్వైవింగ్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్నారు రాజశేఖర్‌. తాజాగా ఆయన యంగ్‌ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. శర్వానంద్‌తో సినిమా చేస్తున్నారని, ఇందులో తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

read  more: Rajasekhar: యంగ్‌ హీరోకి తండ్రిగా రాజశేఖర్‌.. యాంగ్రీ హీరోకి ఏమైంది? భారీ రెమ్యూనరేషన్‌

also read: Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ వార్‌.. చిచ్చు పెట్టిన కలెక్షన్లు, మొత్తం రచ్చ రచ్చ
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories