Aishwarya Rai Daughter Aaradhya Bachchan Files Case : స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గారాల కూతురు ఆరాధ్య బచ్చన్ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్ట్ లో ఆమె కేసు ఫైల్ చేశారు. దాంతో కోర్టు గూగుల్ తో పాటు యూట్యూబ్ కు కూడా నోటీసులు ఇచ్చింది. ఇంతకీ ఆరాధ్య ఏ విషయంలో కేసు వేశారు.
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానెళ్ళు, వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సహాయంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
సినిమా తారలు ఇలాంటి కేసులు వేయడం సర్వసాధారణమే అయినా, స్టార్ జంట కూతురు ఇలా కేసు వేయడంతో ఆరాధ్య చేసిన పనిని చాలా మంది ప్రశంసించారు. ఈ కేసులో తప్పుడు వార్తలు ప్రచారం చేసిన గూగుల్, యూట్యూబ్ లాంటి సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆరాధ్య ఆరోగ్యం, మానసిక స్థితి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేయాలని గూగుల్‌ను ఆదేశించింది. దీనిపై సంబంధిత ఛానెళ్ళ నిర్వాహకుల వివరాలను ఇస్తామని యూట్యూబ్ తెలిపింది.
పిల్లల ఆరోగ్యం, మానసిక స్థితి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని, సెలబ్రిటీల పిల్లలైనప్పటికీ ప్రతి పిల్లవాడినీ గౌరవంగా చూడాలని కోర్టు నొక్కి చెప్పింది.