ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ మూవీ బడ్జెట్ అన్ని కోట్లా! ఈసారి బాక్సాఫీస్ బద్దలే

First Published | Sep 19, 2024, 1:27 PM IST

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ టైటిల్ తో మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర బడ్జెట్ వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. 
 

తీసింది మూడు చిత్రాలే అయినా ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి మూవీతో ఆయన దర్శకుడిగా మారాడు. విజయ్ దేవరకొండకు ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చిన చిత్రం అది. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 
 

షాహిద్ కపూర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ ఉంది. ఇక మూడో చిత్రం యానిమల్ తో దాదాపు వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ కి చేరువయ్యాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

హీరోలను వైల్డ్ గా ప్రజెంట్ చేయడంలో సందీప్ రెడ్డి దిట్ట. ఆయన క్యారెక్టర్స్ ఇంటెన్సిటీ కలిగి ఉంటాయి. యానిమల్ లో రన్బీర్ కపూర్, బాబీ డియోల్ పాత్రలను తీర్చిదిద్దిన తీరు మైండ్ బ్లాక్ చేస్తుంది. అదే సమయంలో సందీప్ రెడ్డి చిత్రాలు వివాదాలకు నెలవు. యానిమల్ మూవీకి వ్యతిరేకంగా పలువురు చిత్ర ప్రముఖులు మాట్లాడారు. 
 


ఏకంగా యానిమల్ మూవీ కంటెంట్ పై పార్లమెంట్ లో ఓ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాలు పక్కన పెడితే యానిమల్ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు అనేది నిజం. సందీప్ రెడ్డి నెక్స్ట్ మూవీ స్పిరిట్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్ ని సందీప్ రెడ్డి వంగ ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఉత్కంఠ అందరిలో ఉంది. 

గతంలో సందీప్ రెడ్డి వంగ స్పందించారు. వైలెన్స్ కి మీనింగ్ చెప్పేలా స్పిరిట్ ఉంటుందని అన్నారు. ఈ సినిమా మరిన్ని వివాదాలు రాజేయవచ్చని ముందుగానే హింట్ ఇచ్చాడు. కాగా స్పిరిట్ బడ్జెట్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 


దాదాపు రూ. 500 కోట్ల బుడ్జెట్ తో స్పిరిట్ తెరకెక్కించనున్నారట. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ. 150 కోట్ల వరకు ప్రభాస్ రెమ్యూనరేషన్ రూపంలో పోతుందట. దర్శకుడు మిగతా నటుల పారితోషికాలకు మరో రూ. 50 కోట్లు కేటాయించనున్నారట. మిగిలిన రూ. 300 కోట్లు నిర్మాణానికి ఖర్చు చేయనున్నారట. 

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తెరకెక్కించనున్నారట. ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల్లో స్పిరిట్ పై ఫ్యాన్స్ లో ప్రత్యేక ఆసక్తి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ 2025 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10 న విడుదల కానుంది.
 

సలార్ 2, కల్కి 2 చిత్రాలలో ప్రభాస్ నటించాల్సి ఉంది. ఇటీవల ప్రశాంత్ నీల్ హీరో ఎన్టీఆర్ తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్, ఎన్టీఆర్ లలో ఎవరితో అనే సందిగ్ధత నెలకొంది. కల్కి 2 పట్టాలెక్కేందుకు కూడా సమయం ఉంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

అలాగే దర్శకుడు హను రాఘవపూడితో పీరియాడిక్ లవ్ అండ్ వార్ డ్రామా ప్రకటించారు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ప్రభాస్ భారీ లైనప్ కలిగి ఉన్నాడు. కల్కితో ప్రభాస్ హిట్ దాయం తీరింది. ఆ మూవీ రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

Latest Videos

click me!