రచయితగా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్వీ కృష్ణారెడ్డి రాణించారు. చివరికి అలీ, వేణు మాధవ్ లాంటి వారిని కూడా హీరోగా పెట్టి అద్భుతాలు చేశారు. కానీ స్టార్ హీరోలతో ఆయన సరైన సక్సెస్ అందుకోలేదు. నందమూరి బాలకృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం టాప్ హీరో. సౌందర్య హీరోయిన్ గా నటించింది.