రజనీకాంత్‌తో పోటీ నుంచి తప్పుకున్న సూర్య, `కంగువా` కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే, ఈ సారి సింగిల్‌గానే

First Published | Sep 19, 2024, 12:30 PM IST

 సూర్య హీరోగా  శివ టీమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కంగువ` సినిమా అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చింది టీమ్‌.

Kanguva

సూర్య బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో జోరుమీదున్నాడు. ఆయన `ఆకాశమే నీ హద్దురా`, `జై భీమ్‌` చిత్రాలతో విజయాలు అందుకుని ఏకంగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. అలాగే `విక్రమ్‌` మూవీలో చివర్లో గెస్ట్ రోల్‌ చేసి గూస్‌ బంమ్స్ తెప్పించారు. ఆయన చివరి మూవీ పెద్దగా ఆడకపోయినా, ఇప్పుడు అంతా `కంగువా` కోసం చూస్తున్నారు ఆడియెన్స్. భారీ పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతుంది. పిరియాడ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిస్తున్నారు దర్శకుడు శివ అండ్‌ టీమ్‌. 

మూడో వారం షాకింగ్‌ ఎలిమినేషన్‌?ః బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్

Kanguva Suriya

 `కంగువా` లో చారిత్రాత్మక ఫాంటసీ అంశాలు ఉంటాయి. ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో కథ నడుస్తుందని, టీజర్‌, ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది.  దీనికి వెట్రి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో సూర్య సరసన బాలీవుడ్ నటి దిశా పటాని హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ప్రేమ్‌కుమార్, కరుణాస్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించింది. 


kanguva

అంతేకాదు ఈ చిత్రంలో నటుడు కార్తీ కూడా అతిథి పాత్రలో నటించారు. కంగువా చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళంతో సహా 10 భాషల్లో విడుదల కానుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. దీన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆయన స్వరపరిచిన ఫైర్ సాంగ్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. 

`కంగువా` చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అందువల్ల ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న (ఆయుధ పూజ సందర్భంగా) విడుదల చేయనున్నట్లు మొదట ప్రకటించారు. అయితే అదే రోజు రజనీకాంత్ నటించిన `వేటైయన్` చిత్రం కూడా విడుదల కానున్నట్లు ప్రకటించడంతో,  రజనీ, సూర్యల మధ్య బిగ్‌ ఫైట్‌ ఉండబోతుందని అంతా కలవరపడ్డారు. ముఖ్యంగా బయ్యర్లు చాలా టెన్షన్ పడ్డారు. అలాగే నిర్మాతల్లోనూ ఆ ఆందోళన ఏర్పడింది. 

Kanguva

ఇద్దరు బిగ్‌ స్టార్స్ మధ్య పోటీ అంటే కలెక్షన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పైగా రెండు భారీ సినిమాలు కావడంతో ఆ ప్రభావం మరింతగా ఉంటుంది. దీంతో ఎట్టకేలకు సూర్య వెనక్కి తగ్గాడు. రజనీకాంత్‌తో పోటీ నుంచి ఆయన తప్పుకున్నారు. తాజాగా `కంగువా` కొత్త డేట్‌ని ప్రకటించింది టీమ్‌. 

అధికారిక ప్రకటన విడుదల చేసింది.  నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఆ రోజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఎలాంటి ఇతర సినిమాల పోటీ లేకుండా విడుదల కాబోతుండటం విశేషం. `సింహం` లా సింగిల్‌గా విడుదల కానున్న `కంగువా` చిత్రంపై మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుమారు వెయ్యి కోట్లు టార్గెట్‌ చేసినట్టు సమాచారం.  మరి ఆ స్థాయిలో సత్తా చాటుతుందా అనేది చూడాలి. 

Latest Videos

click me!