జూనియర్ ఎన్టీఆర్ ని రాజమౌళితో పాటు చాలా మంది సన్నిహితులు తారక్ అంటారు. ఆయనకు యంగ్ టైగర్ అనే బిరుదు కూడా ఉంది. అయితే ఎన్టీఆర్ ని బుడ్డోడు అని పిలిస్తే నచ్చదట. ఎన్టీఆర్ హైట్ రీత్యా ఈ పేరు వచ్చింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ప్రభాస్, మహేష్ అంత్యంత పొడుగు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కొంచెం కురచగా ఉంటారు.
ఎన్టీఆర్ వీరందరికంటే హైట్ తక్కువ. సీనియర్ ఎన్టీఆర్ ఆజానుబాహుడు. కానీ ఆయన సతీమణి బసవతారకం పొట్టిగా ఉంటారు. తల్లి హైట్ పిల్లలకు వచ్చింది. బాలకృష్ణ, హరికృష్ణ పొట్టిగానే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ని హైట్ ప్రాతిపదికగా బుడ్డోడు అని పిలుస్తారు. ఈ పిలుపు ఒకింత కించపరుస్తునట్లు ఉంటుందట.