బర్త్ డే రోజు కృష్ణంరాజు, శోభన్‌బాబులతో రెండు మల్టీస్టారర్స్ ప్రారంభించిన స్టార్‌ హీరో, పాపం రెండూ క్యాన్సిల్

First Published Sep 26, 2024, 6:42 PM IST

ప్రస్తుతం మల్టీస్టారర్‌ సినిమాల ట్రెండ్‌ ఊపందుకుంది. కానీ ముప్పై ఏళ్ల క్రితమే ఓ స్టార్‌ హీరో ఇద్దరు సీనియర్‌ సూపర్‌ స్టార్లతో రెండు మల్టీస్టారర్‌ చిత్రాలను ఓకేరోజు ప్రారంభించారు. కానీ రెండూ క్యాన్సిల్‌. ఆయన ఎవరు ? ఆ సినిమాలేంటి? 
 

ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో మల్టీస్టారర్ రూపొందుతున్నాయి. చాలా వరకు ఆయా సినిమాలు బాగానే ఆడుతున్నాయి. దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అసలు మల్టీస్టారర్‌ చిత్రాలు ఎప్పుడో ప్రారంభమైంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల టైమ్‌లోనే అనేక మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చాయి. అప్పుడు ఇంకా ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు,  కృష్ణంరాజు ఇలా అంతా కలిసి నటించారు. అనేక విజయాలు అందుకున్నారు. అప్పట్లో ఈ చిత్రాలను ఎంతో ప్రత్యేకంగా భావించేవారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లేటెస్ట్ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఆ తర్వాత మధ్య మధ్యలో అడపాదడపా ఇలాంటి మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చాయి. నాగార్జున, శ్రీకాంత్‌, సుమన్‌, వెంకటేష్‌, రాజశేఖర్‌, జగపతిబాబు వంటి హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తూనే వచ్చారు. అందరిలోనూ వెంకీ ఇంకాస్త ముందే ఉంటారు. అప్పుడే కాదు, ఈ జనరేషన్‌తోనూ ఆయన సినిమాలు చేస్తున్నారు.

మహేష్‌ బాబుతో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు`, `గోపాల గోపాల`, `వెంకీ మామ`, `ఎఫ్‌2` వంటి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు అంతకు ముందు సీనియర్లతోనూ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. కానీ అవి ఆగిపోయాయి. ఆ కథేంటో చూస్తే, 
 

Latest Videos


Daggubati Venkatesh

వెంకటేష్‌.. లెజెండరీ నిర్మాత డి రామానాయుడు వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు వెంకటేష్‌. ఆయన అనుకోకుండ హీరో అయ్యారు. మరో హీరో హ్యాండివ్వడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామానాయుడు అప్పటికప్పుడు విదేశాల్లో చదువుతున్న వెంకీని పిలిపించి సినిమాతీశాడు.

అలా వచ్చిందే `కళియుగ పాండవులు`. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. దీంతో వెంకీ హీరోగా సెటిల్‌ అయిపోయారు. రీమేక్‌ సినిమాలతో విజయాలు అందుకున్నారు. `విక్టరీ` ని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఎక్కువగా రీమేక్‌లు చేసిన హీరోగానూ నిలిచారు వెంకీ.

ఒకప్పుడు అత్యధిక సక్సెస్‌ రేట్‌ ఉన్న ఆయన ఇప్పుడు తడబడుతున్నాడు. రీమేక్‌ సినిమాలు వర్కౌట్‌ కాకపోవడం, మంచి కంటెంట్‌ సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో తేడా జరగడం, తన బలమైన ఫన్‌, ఎమోషన్స్ ని దాటి ప్రయోగాలు చేయడం వంటి కారణాలతో ఫెయిల్యూర్స్ చవిచూశాడు వెంకీ. 
 

ఇదిలా ఉంటే వెంకటేష్‌కి సంబంధించిన పలు క్రేజీ విషయాలు బయటకు వచ్చాయి. ఆయన ఇద్దరు సీనియర్‌ సూపర్‌ స్టార్లతో సినిమాలు చేయాల్సింది. కానీ వర్కౌట్‌ కాలేదు. సినిమా షూటింగ్‌లు కూడా ప్రారంభమై ఆగిపోవడం గమనార్హం. ఆ కథేంటో చూస్తే

వెంకటేష్‌.. సోగ్గాడు శోభన్‌బాబు, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజులతో రెండు మల్టీస్టారర్‌ చిత్రాలు చేయాలనుకున్నారు. కథలు కూడా రెడీ అయ్యాయి. సినిమాలు కూడా ప్రారంభమయ్యాయి. 1991 డిసెంబర్‌ 13న వెంకీ బర్త్ డే రోజు ఒకేసారి ఈ రెండు సినిమాలను ప్రారంభించారు తండ్రి రామానాయుుడు.

 శోభన్‌బాబుతోచేయాల్సిన మల్టీస్టారర్ మూవీకి బి గోపాల్ దర్శకుడు. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. బప్పిల హరి మ్యూజిక్‌ అందించేందుకు రెడీ అయ్యారు. 1992 జనవరి 2 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభించారు. కానీ ఈ సినిమా కొన్ని రోజులకే ఆగిపోయింది. మొదట కొన్ని రోజులు శోభన్‌బాబు రాలేదట. ఆయన కోసం వెయిట్‌ చేయడం వల్ల లాభం లేదని వెంకీ సైతం మరో ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిపోయారు. అలా పలు ఇతర కారణాలతో ఈ మూవీ ఆగిపోయింది. 
 

దీంతోపాటు కృష్ణంరాజుతో మరో మల్టీస్టారర్‌ కూడా 1991 డిసెంబర్‌ 13నే వెంకీ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారు. ఈ మూవీకి మాజీ మంత్రి రోజా భర్త సెల్వమణి దర్శకుడు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభించే నాటికి తమిళంలో `చిన్న తంబి` అనే సినిమా విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది.

ఆ మూవీ రీమేక్‌ చేయమని రామానాయుడుకి అడిగారు కొందరు. ఆ సినిమా చూసి నచ్చడంతో సెల్వమణితో చేయాల్సిన సినిమాని పక్కన పెట్టి `చిన్నరాయుడు` పేరుతో సినిమాని ప్రారంభించారు వెంకీ. ఇందులో విజయశాంతి హీరోయిన్‌. ఈ మూవీ చకచకా షూటింగ్‌ జరిగింది. విడుదలైంది. నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమా ఆడకపోవడంతో వెంకీ, రామానాయుడు డిజప్పాయింట్‌ అయ్యారు.

దీంతో సెల్వమణి మూవీని కూడా పక్కన పెట్టేశారు. అలా కృష్ణంరాజుతో వెంకీ చేయాలనుకున్న మల్టీస్టారర్‌ మూవీ సైతం ఆగిపోయింది. ప్రస్తుతం వెంకటేష్‌.. దర్శకుడు అనిల్‌ రావిపూడితో ఓ మూవీ చేస్తున్నారు. అది చిత్రీకరణ దశలో ఉంది. మంచి ఎంటర్‌టైనర్‌ రాబోతుందట. 
 

click me!