ఆ మూవీ డిజాస్టర్... కారణం ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన నాని, డైరెక్టర్ కాదట, మరి ఎవరు?

First Published | Aug 20, 2024, 7:17 AM IST

హీరో నాని నటించిన ఓ చిత్రం డిజాస్టర్ అయ్యింది. నాని కెరీర్లో అత్యధిక నష్టాలు చవి చూసిన చిత్రం అది. కాగా ఆ సినిమా డిజాస్టర్ కావడానికి దర్శకుడు కాదు, మరొకరు కారణం అంటున్నాడు నాని. 
 

Nani

ఆ మధ్య పరాజయాలతో ఇబ్బందిపడ్డ హీరో నాని హిట్ ట్రాక్ లో దూసుకుపోతున్నాడు. ఆయన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దసరా నాని కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఉంది. పాజిటివ్ టాక్ తో మెల్లగా పుంజుకున్న హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ దాడి హిట్ స్టేటస్ అందుకుంది. 

Saripodhaa Sanivaaram

సరిపోదా శనివారం మూవీతో హ్యాట్రిక్ పై కన్నేశాడు నాని. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం ఆగస్టు 29న విడుదల కానుంది. నానికి జంటగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఎస్ జే సూర్య ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. 


Saripodhaa Sanivaaram

సరిపోదా శనివారం ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. నాని స్ప్లిట్ పర్సనాలిటీ తో బాధపడే యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్ చేస్తున్నాడు. సరిపోదా శనివారం పలు భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో నాని గట్టిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. 

సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై వెళ్లిన నాని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తో నానికి ఇది రెండో చిత్రం గతంలో అంటే సుందరానికీ టైటిల్ తో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేశారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కమర్షియల్ గా ఆడలేదు. నాని కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా అంటే సుందరానికీ నిలిచింది. 

అయినప్పటికీ నాని దర్శకుడు వివేక్ ఆత్రేయకు మరో ఛాన్స్ ఇచ్చాడు. కాగా అంటే సుందరానికీ ఫెయిల్యూర్ లో వివేక్ ఆత్రేయ తప్పేమీ లేదని నాని అన్నారు. ఆ మూవీ ఫెయిల్ కావడానికి కారణం తానే అని చెప్పడం చర్చకు దారి తీసింది. 

నాకు స్క్రిప్ట్ లో ఏం చెప్పాడో వివేక్ ఆత్రేయ అదే తీశాడు. అంటే సుందరానికీ మూవీ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అంచనాలు క్రియేట్ చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. కాబట్టి ఆ మూవీ ఫెయిల్యూర్ బాధ్యత నాదే అన్నారు. సరిపోదా శనివారం మూవీ విషయంలో ఆ తప్పు జరగదు. ప్రేక్షకుల అంచనాలు ఆదుకుంటామని నాని విశ్వాసం వ్యక్తం చేశాడు. 

Latest Videos

click me!