అప్పట్లోనే నంది అవార్డులు సాధించిన ఘనత ఆయనది, మా నాన్నే త్రివిక్రమ్ సినిమా చూడు అంటారు..హరీష్ శంకర్

First Published | Aug 19, 2024, 8:58 PM IST

డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే కమర్షియల్ చిత్రాలని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసే దర్శకుడు. ఆయన ఎక్కువగా రీమేక్ చిత్రాలు చేస్తున్నప్పటికీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో వెనకడుగు వేయరు. కానీ ఎక్కడో మిస్టర్ బచ్చన్ చిత్రం విషయంలో హరీష్ శంకర్ లెక్క తప్పినట్లు ఉంది.

డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే కమర్షియల్ చిత్రాలని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసే దర్శకుడు. ఆయన ఎక్కువగా రీమేక్ చిత్రాలు చేస్తున్నప్పటికీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో వెనకడుగు వేయరు. కానీ ఎక్కడో మిస్టర్ బచ్చన్ చిత్రం విషయంలో హరీష్ శంకర్ లెక్క తప్పినట్లు ఉంది. ఆగష్టు 15న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. 

హరీష్ ఈ చిత్రంలో రాసుకున్న సన్నివేశాలపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో వివాదం చెలరేగేలా హరీష్ ఒక డైలాగ్ పెట్టారు. రవితేజ చెప్పే డైలాగ్ త్రివిక్రమ్ పై పంచ్ వేసినట్లు గా ఉంది. నేను మాయలోడినే.. కానీ మాయల మాత్రికుడ్ని కాదు.. మతాల మాంత్రికుడిని కాదు.. మ్యాటర్ ఉన్న మాంత్రికుడిని అంటూ విలన్ కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ ఉంది. 


మాటల మాంత్రికుడు అని వినగానే ఎవరు గుర్తకు వస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో త్రివిక్రమ్, హరీష్ మధ్య ఉన్న విభేదాలు ఏంటి అంటూ చర్చ మొదలయింది. తాజాగా ఈ విషయంలో హరీష్ శంకర్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. మీకు త్రివిక్రమ్ తో ఏమైనా విభేదాలు ఉన్నాయా అని ప్రశ్నించగా హరీష్ శంకర్ స్పందించారు. 

Trivikram Srinivas

మంచి ప్రశ్న అడిగారు.. ఈ వార్త నా వరకు కూడా వచ్చింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాకముందే త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రచయితగా రెండు మూడు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన డైలాగ్స్ అంటే నాకు పిచ్చి. ఆయన నాకన్నా చాలా సీనియర్. ఇప్పుడు చెప్పబోయే విషయం నేను ఇంతవరకు ఎవరితో చెప్పలేదు. 

Trivikram

మానాన్న త్రివిక్రమ్ గారికి పెద్ద అభిమాని. అతడు చిత్రాన్ని అయన వందల సార్లు చూశారు. త్రివిక్రమ్ గారిని మా ఇంట్లో పెద్ద కొడుకు లాగే భావిస్తాం. నా సినిమాల్లో కమర్షియల్ అంశాలు ఎక్కువైతే.. మానాన్న త్రివిక్రమ్ సినిమాలు చూడు అని సలహా ఇస్తారు. అంతలా మా ఇంట్లో త్రివిక్రమ్ ని అభిమానిస్తాం అంటూ హరీష్ తెలిపారు. త్రివిక్రమ్ కి, నాకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని హరీష్ శంకర్ తేల్చేశారు. 

Latest Videos

click me!