పెళ్లి, చావు రెండూ ఒక్కటే.. నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల మ్యారేజ్‌పై రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

Published : Aug 19, 2024, 10:27 PM IST

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం మాట్లాడినా క్రేజీగా ఉంటుంది. తాజాగా ఆయన నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల ల పెళ్లిపై స్పందించారు. షాకింగ్‌ కామెంట్స్ చేశారు.   

PREV
15
పెళ్లి, చావు రెండూ ఒక్కటే.. నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల మ్యారేజ్‌పై రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

నాగచైతన్య, సమంత మూడేళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. ఏడేళ్ల ప్రేమ, నాలుగేళ్ల పెళ్లి బంధం అనంతరం ఈ ఇద్దరు విడిపోయారు. డైవర్స్ తీసుకోవడానికి అసలు కారణం ఏంటనేది మాత్రం తెలియదు. రకరకాల పూకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వాళ్లిద్దరికి, వారి ఫ్యామిలీకే తెలుసు. 
 

25
Naga Chaitanya and Sobhita

రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ నాగచైతన్య పెళ్లికి రెడీ అయ్యారు. రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. నటి శోభితా దూళిపాళ్ల తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. త్వరలోనే మ్యారేజ్‌ కూడా జరగబోతుంది. కొన్నాళ్లుగా ఈ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నాడు. డేటింగ్‌ చేశారు. ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారు. శోభితాతో డేటింగ్‌లో ఉండటం వల్లే సమంతని చైతూ వదిలేశాడా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి చైతూ రెండోపెళ్లి చేసుకోబోతున్నారు. 
 

35

ఈ క్రమంలో వీరి పెళ్లిపై తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు. జరుగుతున్న చర్చపై ఆయన తనదైన స్టయిల్‌లో కామెంట్‌ చేశారు. శోభితా వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారనే వాదనపై వర్మ చెబుతూ, ఈ పుకార్లన్నీ వాళ్ల వినోదం కోసం సృష్టించుకున్నవి. వాళ్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మాట్లాడుకునేవి. ఆ సమస్య అనేది ఆ ముగ్గురికి సంబంధించిన విషయం. బయటి వాళ్లు మాట్లాడటమనేది అందరు మాట్లాడతారు. పొద్దున లేస్తే అంతా మాట్లాడతారు. ఎవరి స్థాయి బట్టి, వనరులను బట్టి మాట్లాడుతుంటారు. వాళ్ల వినోదం కోసం ఏమైనా చేస్తుంటారు. అదంతా సోషల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. కానీ ఇందులో అంతిమంగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం ఆముగ్గురే. ఆ ముగ్గురు ఏమనుకుంటున్నారనేది వాళ్లిష్టం. దానిపై మనం కామెంట్‌ చేయలేమని తెలిపారు వర్మ. 
 

45
Naga Chaitanya-Sobhita Dhulipala

నాగార్జున మిమ్మల్ని పెళ్లికి పిలిస్తే వెళ్తారా? అనే ప్రశ్నకి స్పందిస్తూ, తాను వెళ్లను అని తెగేసి చెప్పాడు వర్మ. ముందు నాగ్‌ నన్ను పిలవడని, తాను రాను అని ఆయనకు తెలుసు అని, అందుకే పిలవడం మానేశాడని తెలిపారు ఆర్జీవీ. తాను పెళ్లిని, చావుని ఒకేలా చూస్తానని, చావు అంటే స్వేచ్ఛ జీవితం నుంచి, మరో లోకంలోకి వెళ్లిపోతున్నట్టు, అలాగే పెళ్లి కూడా స్వేచ్చని వదిలేసి మరో లోకంలోకి వెళ్లిపోతున్నట్టే అని తెలిపారు వర్మ. తన దృష్టిలో పెళ్లి, చావు ఒక్కటే అని తెలిపారు. 
 

55

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత అనారోగ్యానికి గురైంది. మయోసైటిస్‌ సమస్యతో బాధపడింది. ఎట్టకేలకు దాన్నుంచి కోలుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల చేసేందుకు రెడీ అవుతుంది. రీఎంట్రీ ఇస్తూ `మా ఇంటి బంగారం` అనే సినిమా చేస్తుంది. అలాగే హిందీలో రెండు వెబ్‌ సిరీస్‌లుచేస్తున్నట్టు సమాచారం. మరోవైపు `ది ఫ్యామిలీ మ్యాన్‌` డైరెక్టర్ తో ఆమె డేటింగ్‌లో ఉందని, పెళ్లి చేసుకోబోతుందనే రూమర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories