గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. టాలీవుడ్ నటులు కూడా ఆయన బాధితులే. అసలు నాగ చైతన్య-సమంతల మధ్య మనస్పర్థలు తలెత్తడానికి, విడాకులకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని కొండా సురేఖ అన్నారు. తమ రాజకీయాల కోసం ఓ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని.. కొండా సురేఖపై విమర్శలు వెల్లువెత్తాయి.
టాలీవుడ్ నటులు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి నటులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. విమర్శల నేపథ్యంలో కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.