ఇక ఎన్టీఆర్ వరుస ప్లాప్ లు చూసిన టైమ్ లో.. హిట్ సినిమాలకు బీజం పడింది టెంపర్ తోనే. ఈసినిమా అద్భుతవిజయంతో పాటు.. తారక్ కు డిపరెంట్ మాస్ ఇమేజ్ ను ఇచ్చింది. నెగెటీవ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో ఎన్టీఆర్ అద్భుంగా నటించాడు. ఇక పూరీ జగన్నాద్ మార్క్ సినిమాలో ప్రతీ సీన్ ల కనిపిస్తుంది.
నందమూరి హీరోకు టెంపర్ సినిమాకు ముందు వరకు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. శక్తి , రభస, రామయ్య వస్తావయ్య ఇలా వరుస పెట్టి డిజాస్టర్ సినిమాలు అప్పుడప్పుడు హిట్ సినిమాలతో ఎన్టీఆర్ కెరీర్ కాస్త కన్ ఫ్యూజన్ లో పడింది. ఇక 2015లో పూరి జగన్నాథ్ ఎప్పుడైతే టెంపర్ సినిమా ఇచ్చాడో.. అప్పటి నుంచీ... ఎన్టీఆర్ సక్సెస్ జర్నీ స్టార్ట్ అయ్యింది.