చిరంజీవి ఊరికే మెగాస్టార్ అయిపోలేదు. ఈ జర్నీ వెనకాల ఎంతో కష్టం ఉంది, హార్డ్ వర్క్ ఉంది. ప్రతిభ ఉంది, సేవ ఉంది, ప్రేమ ఉంది. గొప్పతనం చాటుకున్న సందర్భాలు కోకోల్లలు. అందుకే చాలా మంది ఆయనతో పనిచేసిన దర్శక, నిర్మాతలు, ఆర్టిస్టులు గానీ అంటుంటారు చిరంజీవి ఊరికే మెగాస్టార్ అయిపోలేదు అని. తనని తాను నటుడిగా చెక్కుకుంటే, స్టార్‌గా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఎన్నోఆటుపోట్లు, అవమానాలను ఫేస్ చేశాడు. ప్రారంభంలో కొంత మంది చిరంజీవిని ప్రోత్సహించాలని చూశారు, ఆయన టాలెంట్‌ని చూసి ఆశ్చర్యపోయి ఎంకరేజ్ చేశారు. ఈ ప్రాసెస్‌లో తెలియకుండానే కొంత మంది తొక్కేసే ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. బయటకు రానివి చాలా జరిగే ఉంటాయి.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే ప్రారంభంలో చిరంజీవికి జరిగిన అవమానం బయటకు వచ్చింది. ఓ నిర్మాత చిరంజీవి ఎండలో రోజంతా నిలబెట్టిన ఘటన కూడా ఉందట. షూటింగ్‌కి లేట్‌గా వచ్చాడని ఆ మూవీకి హీరో అని కూడా చూడకుండా ఆ నిర్మాత చిరుకి పనిష్‌మెంట్ ఇచ్చాడట. దాని వల్ల రోజంతా ఎండలోనే నిల్చున్నాడట మెగాస్టార్. అది అందరిని కలిచి వేసిందట. టైమ్ అంటే చిరు, చిరు అంటే టైమ్ అనేది అప్పట్నుంచే అలవర్చుకున్నారట. మరి ఇంతకి ఏ సినిమా టైమ్‌లో ఇది జరిగింది? అాలా చేసిన నిర్మాత ఎవరనేది చూస్తే, షాక్ అవ్వాల్సిందే.
చిరంజీవి ఈ అవమానం ఫేస్ చేసింది `కోతలరాయుడు` సినిమా సమయంలో అట. 1979లో వచ్చిన ఈ సినిమాకి కే వాసు దర్శకుడు. ఇందులో చిరంజీవి హీరోగా నటించారు. మాధవి ఆయనకు జోడీగా చేసింది. గిరిబాబు, హేమ సుందర, చక్రపాణి, కేవీ చలం, నిర్మలమ్మ, మంజు భార్గవి, ఆర్ నారాయణ మూర్తి, బేబీ తులసి నటించారు. నటి తులసి ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం విశేషం. ఓ రోజు సినిమా షూటింగ్‌కి చిరంజీవి లేట్‌గా వచ్చాడట. ఆయన కోసం టీమ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనే హీరో. ఆయనపైనే సన్నివేశాలు తీయాల్సి ఉంది. చిరంజీవి లేట్‌గా రావడంతో నిర్మాతకు కోపం వచ్చింది. మండిపోయిన నిర్మాత చిరుని ఎండలోనే ఉండాలని ఫనిష్‌మెంట్ ఇచ్చాడట.
అలాగే ఆ రోజు మొత్తం ఎండలోనే నిల్చున్నాడని తెలిపింది నటి తులసి. ఆమె ఇందులో బాలనటిగా నటించడమే కాదు, చిరంజీవి నటించిన సత్యం పాత్రకి ఆమె మేనకోడలు పాత్రని పోషించింది. వీరిద్దరి మధ్య చాలా సన్నివేశాలున్నాయి. ఆ టైమ్‌లో జరిగిన సంఘటనని ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది తులసి. చిరంజీవి ఎంత గొప్పవారు, ఆయన మెగాస్టార్ ఎందుకయ్యాడో చెబుతూ ఈ విషయాన్ని తెలిపింది. అప్పుడు చిరంజీవిని తులసి అన్నయ్య అని పిలిచేదట. ఇప్పటికీ అలానే పిలుస్తానని తెలిపింది. ఇటీవలే ఓ సారి చిరంజీవి కలిసినప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసిందట. అయితే దాన్ని చిరంజీవి మర్చిపోయినట్టు తెలిపింది తులసి. అది చిరంజీవి గొప్ప మనసుకి నిదర్శనం, ఎదగడం అంటే ఏజ్‌లోనో ఆస్తిలోనే కాదు, మనసులో ఎదగాలని తెలిపారు తులిసి.
మరి చిరంజీవికి పనిష్‌మెంట్ ఇచ్చిన ఆ నిర్మాత ఎవరో కాదు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కావడం విశేషం. ఎందుకంటే ఆ మూవీకి ఆయన నిర్మాత. తులసి చెప్పినదాని ప్రకారం ఆ సినిమా నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజనే ఆ పని చేసి ఉంటాడని అర్థమవుతుంది. ప్రస్తుతం తమ్మారెడ్డి సినిమాలు చేయడం లేదు. ఒకప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా సినిమాల్లో నటుడిగా కనిపిస్తున్నాడు.