ఆ వ్యసనం తో బాధపడుతున్న మహేష్ బాబు... మాన్పించలేక సతమతం అవుతున్న నమ్రత!

First Published | Dec 23, 2023, 8:12 AM IST


మహేష్ బాబు-నమ్రత టాలీవుడ్ బెస్ట్ కపుల్ అనడంతో సందేహం లేదు. గత 18 ఏళ్లుగా వాళ్ళ మధ్య అన్యోన్య దాంపత్యం ఉంది. కాగా మహేష్ బాబుకు ఒక వ్యసనం ఉందట. అది నమ్రత కూడా మాన్పించలేకపోతున్నారట. 
 

హీరోలు కూడా మనుషులే... సామాన్యుల వలే వాళ్లకు కూడా బలహీనతలు ఉంటాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకప్పుడు విపరీతంగా దమ్ము కొట్టేవాడట. ఆ అలవాటు మానుకోవడానికి చాలా ఏళ్ళు పట్టిందని స్వయంగా తెలియజేశాడు. అలాగే చాలా మంది హీరోలు తమకున్న వ్యసనాలను ఓపెన్ గా చెప్పారు. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ఓ వ్యసనం ఉందట. ఆ అలవాటును భార్య నమ్రత కూడా మాన్పించలేకపోతుందట. ఈ మేరకు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 


Namrata Shirodkar

మహేష్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీనే ఆయన ప్రపంచం. ప్రతి ఏడాది అనేక మార్లు కుటుంబంతో కలిసి టూర్స్ కి వెళతారు. మహేష్ ఫ్యామిలీ దాదాపు ప్రపంచాన్ని చుట్టేశారు. ఇక ఇంట్లో ఉంటే కొడుకు, కూతురుతో సరదాగా గడుపుతారు. నచ్చిన పుస్తకాలు చదువుతారు. సినిమాలు చూస్తారు...

అయితే మహేష్ కి వీడియో గేమ్స్ ఆడటం అంటే పిచ్చి అట. గౌతమ్, సితారతో కలిసి గంటల తరబడి ఆడతాడట. ఇది నమ్రతకు అసలు నచ్చదట. ఆ వీడియో గేమ్స్ పిచ్చి తగ్గించాలని నమ్రత చాలా ట్రై చేశారట. అయినా మహేష్ మానుకోవడం లేదట. 
 

కాగా మహేష్ కి గతంలో ధూమపానం అలవాటు కూడా ఉండేదట. విపరీతంగా స్మోకింగ్ చేసేవాడిని. ఆ వ్యసనం నుండి బయటపడ్డానని ఓ సందర్భంలో మహేష్ బాబు స్వయంగా తెలియజేశాడు.  మొబైల్ సైతం మహేష్ కి ఒక వ్యసనం అట. నిద్రలేవగానే ఫోన్ చూస్తారట. ఈ విషయాన్ని కూడా ఆయన స్వయంగా చెప్పారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం గుంటూరు కారం చేస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. 

నెక్స్ట్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళితో మూవీ చేయనున్నారు. ఫస్ట్ టైం వీరి కాంబో సెట్ అయ్యింది. పాన్ వరల్డ్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇది జంగిల్ అడ్వెంచర్, యాక్షన్ డ్రామా అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించనున్నాడట..

Latest Videos

click me!