నాన్నకు అలా చేస్తే నచ్చదు... మహేష్ బాబు ప్రైవేట్ మేటర్ లీక్ చేసిన సితార!

Published : May 27, 2024, 09:22 AM IST

మహేష్ బాబుకు ఒక విషయం అసలు నచ్చదట. నాన్న ప్రైవేట్ మేటర్ లీక్ చేసింది కూతురు సితార ఘట్టమనేని. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
16
నాన్నకు అలా చేస్తే నచ్చదు... మహేష్ బాబు ప్రైవేట్ మేటర్ లీక్ చేసిన సితార!


సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా కాకుండా.. తన సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉంది సితార ఘట్టమనేని. ఇప్పటికే నెట్టింట లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న సితార...  తన  టాలెంట్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. . సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు కూడా చేస్తుంటారు. 

26


తన తండ్రితో కలిసి మంచి పనుల్లో భాగం అవుతుంది. ఆ మధ్య తన సంపాదనతో అనాథ బాలికలకు సైకిల్స్  దానంగా ఇచ్చింది. సామాజిక సేవలో కూడా భాగం అవుతుంది. సితార ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. 
 

36


ఇంస్టాగ్రామ్ తో పాటు సితారకు సొంతంగా య్యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో ఆమె పెట్టే వీడియోలకు భారీగా రెస్పాన్స్ వస్తుంటుంది.  అంతే కాదు ఇన్ స్టాతో పాటు.. యూట్యూబ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది సితార. ఆమె లక్షల రూపాయలు సంపాదిస్తుందని సమాచారం. 
 

46


సితార క్రేజ్ చూస్తుంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం పక్కా అని తెలుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు.. సినిమాలు అంటే ఆమెకు  ఎంతో ఆసక్తి ఉంది. అందుకే సితార తరచూ సినిమాలలోని పాటలకు డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. 

56
Mahesh Babu

ఇటీవల సితార ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు ప్రశ్నల మీద ఆమె స్పందించారు. సమాధానాలు చెప్పారు. ఆ మధ్య మహేష్ అక్క మంజుల ఆయన జుట్టు పట్టుకుని ఆట పట్టించింది. ఈ వీడియో చూపించి సితారను మహేష్ రియాక్షన్ ఏమిటని అడగడం జరిగింది. 


 

66

సితార మాట్లాడుతూ... నాన్నకు జుట్టును టచ్ చేస్తే అసలు నచ్చదు. కోపం వచ్చేస్తుంది. నేను కూడా ఆయన జుట్టు టచ్ చేస్తూ అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటానని సితార చెప్పుకొచ్చింది. సితార కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories