‘గేమ్‌ ఛేంజర్‌’హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్, దిల్ రాజు వాటికి ఒప్పుకున్నారా?

First Published May 27, 2024, 8:55 AM IST

రామ్‌చరణ్‌ స్టెప్పులను మ్యాచ్‌ చేసేందుకు  ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఇందులో చాలా కష్టమైన స్టెప్స్‌ ఉన్నా.. 


తమిళ దర్శకుడు  శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.   రామ్‌  చరణ్‌ క్రేజ్ కు తగ్గ మరో పాన్‌ ఇండియా చిత్రమిది.  రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గానూ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక కీ హీరోయిన్ గా చేస్తున్న కియారా నిర్మాతలకు పెడ్తున్న డిమాండ్స్ గురించి బాలీవుడ్ మీడియా షాక్ అయ్యే విషయాలు చెప్తోంది. అవేమిటంటే...
 


కియారా డిమాండ్స్ అంటూ బాలీవుడ్ మీడియాలో ఆర్టికల్స్ మొదలయ్యాయి. ఆమె తనను తాను ఓ దేవకన్యలా ఫీలవుతుందని , అంతేకాకుండా ఆమె తన స్దాయికి మించి డిమాండ్స్ నిర్మాతల ముందు పెడుతుందని చెప్తున్నారు.  అందులో ఆమె షూటింగ్ నిమిత్తం రావాలంటే లగ్జరీ ప్రయాణం , పర్శనల్ జిమ్  ట్రైనర్ అదీ ముంబై నుంచి రావాల్సి ఉంటుందని చెప్తోందిట. అలాగే ఓ ప్రెవేట్ చెఫ్ కావాలంటుందిట.


 ఆ ప్రెవేట్ చెఫ్ సైతం చాలా కాస్టలీ వ్యవహారం అని అంటున్నారు. ఈ క్రమంలో మిమిమం యాభై నుంచి అరవై లక్షలు దాకా నిర్మాతకు ఎగస్ట్రా బర్డెన్ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఈ డిమాండ్స్ కు ఒప్పుకునే దిల్ రాజు సినిమా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే  ఇది బాలీవుడ్ వెబ్ సైట్స్ స్వతంగా వండి వడ్డించిన వార్త అని కొందరంటున్నారు. 
 


ఇక కియారా సినిమాల విషయానికొస్తే..బాలీవుడ్‌ ‘డాన్‌’ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘డాన్‌ 3’. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహించనున్న ‘డాన్‌ 3’లో రణ్‌వీర్‌ సింగ్‌ సరసన హీరోయిన్ గా నటిస్తోంది కియారా.. గత ఏడాది ‘సత్యపేమ్‌ కీ కహానీ’ చిత్రంతో అలరించిన ముంబై బ్యూటీ ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్‌’, హిందీలో ‘వార్‌ 2’, డాన్ 3 చిత్రాల్లో నటిస్తుంది..
 


కియారా మాట్లాడుతూ... ‘ఎన్నో భిన్నమైన పాత్రలు ఎంచుకుని, నన్ను నేను నిరూపించుకుంటూ చిత్రపరిశ్రమలో విజయవంతంగా 10ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఈ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించి  ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను.  ఇప్పుడిప్పుడే మరింత కొత్త కథల వైపు అడుగేస్తున్నా. వాటితోనే ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. కానీ చేసే క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స లేని ప్రాజెక్టుల్లో భాగం కావాలని కోరుకోను. కథలో విషయం ఉండాలి. పోషించే పాత్ర సినిమాకి ముఖ్యమైనదై ఉంటేనే అందులో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటాను’ అని చెప్పుకొచ్చింది.. 

అలాగే నాకు యాక్షన్  జానర్‌ చిత్రాలంటే ఇష్టం. చాలా రోజులుగా ఆ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.  ‘వార్‌ 2’, ‘డాన్‌ 3’లతో ఆ కోరిక నెరవేరబోతుంది. ఇవి నా కెరీర్‌లోనే పెద్ద  సినిమాలు. ప్రేమకథలు, కామెడీ..ఇలా అన్ని జానర్లలో పనిచేశాను. కానీ చాలా కాలంగా పూర్తిగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటించడం కోసం వేచి చూస్తున్నాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. 
 


ఒకానొక సమయంలో ‘షేర్షా’ సినిమాలో నేను భాగమైనప్పుడు.. ‘ఓ మై గాడ్‌ ఇదొక యుద్థానికి సంబంధించిన యాక్షన్‌ చిత్రం. ఇలాంటి ప్రాజెక్టులో ఈమె నటిస్తుందా..?’ అని కొంతమంది నా మీద కామెంట్స్‌ చేశారు. కానీ.. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రెండు పెద్ద సినిమాలు నా చేతుల్లో ఉన్నాయి. ఈ చిత్రాల ద్వారా నన్ను నిరూపించుకోవాలి. ప్రస్తుతం నా ఎదుట ఉన్న లక్ష్యం అదే. 
 


అలాగే త్వరలోనే నేను నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘జరగండి జరగండి’ పాటకు నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో ఇదే కష్టమైనది. దాదాపు 10 రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఒక పాటకు ఇన్ని రోజుల షూటింగ్‌ ఇంతకు ముందెప్పుడు చేయలేదు. దీని కోసం షూటింగ్‌ తర్వాత కూడా 3 నుంచి 4గంటలపాటు రిహార్సల్స్‌ చేశాను. 


రామ్‌చరణ్‌ స్టెప్పులను మ్యాచ్‌ చేసేందుకు  ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఇందులో చాలా కష్టమైన స్టెప్స్‌ ఉన్నా.. ఇది నాకొక మంచి అనుభవం దర్శకుడు శంకర్‌తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. సినిమాల పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి ఆయన.  ఆయనలో ఇదే నాకు ఎక్కువగా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చింది కియారా. 


 ఇక  ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట. 


ప్రస్తుతం తాను నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పొలిటికల్ యాక్షన్ మూవీ అని.. అలాగే ఆ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఐదు పాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇన్నాళ్లు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ రిలీజ్ పై స్పష్టత ఇచ్చేశారు చరణ్.


అలాగే రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   


గేమ్ ఛేంజర్ సినిమా గురించి అంజలి మాట్లాడుతూ.. ఇంకా షూటింగ్ కొంచెం ఉంది. త్వరలోనే రిలీజ్ అవుతుంది. చరణ్ తో కలిసి నేను ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాను. మా ఇద్దరికీ ఒక సాంగ్ కూడా ఉంది. నేను ఇందులో హీరోయిన్ గానే నటిస్తున్నాను, కీ రోల్ కాదు అని తెలిపింది. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇవ్వమని మీడియా ప్రతినిధులు అడగ్గా దిల్ రాజు గారు, శంకర్ గారు చెప్పకుండా మేము చెప్పకూడదు అని చెప్పింది. అలాగే రామ్ చరణ్ మంచి వ్యక్తి. నటనలో 100 శాతం ఇవ్వడానికి ట్రై చేస్తాడు అని చరణ్ గురించి చెప్పింది. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందని క్లారిటీ అయితే వచ్చింది.


 సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్నా లీక్స్ తప్ప సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్స్ రాలేదు. అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్న సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని నిరాశ చెందుతున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి కూడా నటిస్తుందని తెలిసిందే. ఇప్పటికే లీక్ అయిన ఫోటోలతో అంజలి ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ సరసన కనిపిస్తుందని అర్ధమవుతుంది.
 


వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.  ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.


 తండ్రీ, కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కోసం చెర్రీ ఫ్యాన్స్  ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2021 లో అనౌన్స్ చేసిన ఈ సినిమా నుండి కేవలం టైటిల్ గ్లింప్స్ తప్ప ఎటువంటి అప్ డేట్ లేదు  ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
  

Latest Videos

click me!