షూటింగ్ లో పీరియడ్స్ వస్తే అలా చేస్తాను.. ఈషా రెబ్బా ఓపెన్ కామెంట్స్ 

First Published May 27, 2024, 7:20 AM IST


పీరియడ్స్ వచ్చినా షూటింగ్ చేయక తప్పదు అంటుంది ఈషా రెబ్బా. ఆ ఇబ్బందిని ఎలా అధిగమిస్తుందో చెప్పుకొచ్చింది. ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

Eesha Rebba

ఈషాకు కాలం కలిసిరాలేదు. కెరీర్ ని నిలబెట్టే ప్రాజెక్ట్ దక్కలేదు. అందుకే ఆమె లైమ్ లైట్లో లేకుండా పోయింది. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. తెలుగులో ఈషాకు ఆఫర్స్ తగ్గాయి. ముఖ్యంగా హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు. 

Eesha Rebba

గత ఏడాది ఈషా దయ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి భార్య అలివేలు పాత్రలో ఆమె కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీగా నటించి మెప్పించారు. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దర్శకుడు పవన్ సాధినేని దయ సిరీస్ రూపొందించాడు. 

 ఆ మధ్య ఓ  తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది. 

2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అభిజీత్ హీరోగా నటించాడు. హ్యాపీ డేస్ సక్సెస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు. 

అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంతకు ముందు ఆ తర్వాత చిత్రం తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు. ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది. అదే సమయంలో  వివక్ష కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తెలుగులో కన్నడ, మలయాళ, హిందీ భామల హవా నడుస్తోంది.
 

Eesha Rebba

కాగా పీరియడ్స్ వచ్చినా షూటింగ్ చేయక తప్పదు అంటుంది ఈషా రెబ్బా. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... షూటింగ్ అనేది చాలా మంది సిబ్బందితో కూడిన పని. అలాగే ఖర్చుతో కూడిన వ్యవహారం. మనకు పీరియడ్స్ వచ్చాయని షూటింగ్ చేయను అంటే కుదరదు. 

పీరియడ్స్ వలన నొప్పి వస్తే పెయిన్ కిల్లర్స్ వాడతాను. కొందరు డైరెక్టర్స్ పీరియడ్స్ అంటే అర్థం చేసుకుంటారు. కోలుకునే సమయం ఇస్తారని ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!