‘పొన్నియిన్ సెల్వన్’లో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, విక్రమ్ ప్రభు అందరితో కలిసి పనిచేయటం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం తనకుందన్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో రిలీజ్ కానుంది.