నా భార్యకు నాకు మధ్య పుల్లలు పెడతారా? పబ్లిక్ లో ఫైర్ అయిన బాలయ్య? ఇంతకీ ఏం జరిగింది?

First Published | Oct 11, 2024, 6:02 PM IST

పబ్లిక్ లో బాలకృష్ణ వ్యాఖ్యలు, చేష్టలు సంచలనం రేపుతుంటాయి. తాజాగా ఆయన, నా భార్యకు నాకు మధ్య పుల్లలు పెడతారా? అంటూ ఫైర్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. 
 

Balakrishna

నందమూరి బాలకృష్ణ మనసులో ఏదనిపిస్తే అది చేసేస్తాడు. మాట్లాడేస్తాడు. పబ్లిక్ లో బాలయ్య చర్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. అభిమానులను బాలయ్య కొట్టిన సందర్భాలు కోకొల్లలు. రోడ్ల మీద వెంబడించి తన్నిన రోజులు కూడా ఉన్నాయి. 
 

ఒక్కోసారి బాలయ్యకు సడన్ గా కోపం వస్తుంది. దాన్ని అప్పుడే తీర్చేసుకుంటాడు. ఇటీవల హీరోయిన్ అంజలితో బాలయ్య ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు బాలయ్య. కార్యక్రమంలో చివర్లో హీరోయిన్ అంజలి, నేహా శెట్టి ఆయనతో ఫోటోకి పోజిచ్చేందుకు దగ్గరకు వచ్చాడు. 

అంజలిని దురుసుగా వెనక్కి నెట్టాడు బాలకృష్ణ. ఇది నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. సింగర్ చిన్మయి వంటి ఫెమినిస్ట్స్ ఖండించారు. అయితే బాలయ్య నాతో తప్పుగా ఏమీ ప్రవర్తించలేదు. మా మధ్య ఉండే అనుబంధం రీత్యా చనువు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా అంజలి వివరణ ఇచ్చింది. 


Balakrishna

సీనియర్ దర్శకుడు కే ఎస్ రవికుమార్ షూటింగ్స్ సెట్స్ లో బాలయ్య ప్రవర్తన మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరైనా నవ్వితే బాలకృష్ణకు కోపం వస్తుంది. ఒకసారి నా అసిస్టెంట్ ని ఆయన కొట్టబోయారు. నేను అడ్డుపడి ఆపాను అన్నారు. అయితే ఇదంతా ఒక యాంగిల్ మాత్రమే. బాలయ్యను దగ్గరగా చూసిన వాళ్లు ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటారు. 

తాజాగా బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో నాకు, నా భార్యకు మధ్య చిచ్చు పెడతారా... అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. 
 

Balakrishna

బాలకృష్ణ, మీనాక్షి చౌదరి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లారు. బాలయ్యను చూసేందుకు అభిమానులు పెద్ద మొత్తంలో పోటెత్తారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. రిబ్బన్ కటింగ్ చేసి షాపింగ్ మాల్ ఓపెన్ చేశాడు బాలయ్య. అనంతరం మాల్ లో కాసేపు కలియతిరిగారు. దుస్తులు, పట్టు చీరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ విలేకరి.. సర్ మీరు ఎప్పుడైనా మేడం కి పట్టు చీర కొనుక్కుని వెళ్ళారా? అని అడిగాడు. దానికి బాలయ్య ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడివన్నీ ఎందుకయ్యా... మా మధ్య పుల్లలు పెట్టడానికి కాకపోతే... అన్నాడు. నా భార్యకు నేనెప్పుడూ చీర కొనివ్వలేదన్న విషయం గుర్తు చేసి గొడవలు పెట్టొద్దని.. పరోక్షంగా బాలయ్య అన్నారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1982లో వసుంధర దేవిని బాలకృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయన వెండితెర ప్రవేశం కాస్త ఆలస్యమైంది. మోక్షజ్ఞ 30 ఏళ్ల వయసులో హీరో కావడం కొసమెరుపు. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మోక్షజ్ఞ లుక్ విడుదల చేశారు. దానికి మిశ్రమ స్పందన దక్కింది. మోక్షజ్ఞ మొదటి చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. 
 

Mokshagna

మరోవైపు బాలకృష్ణ వరుస విజయాలతో జోరుమీదున్నాడు. అఖండ మూవీతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలతో బాలకృష్ణ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ లుక్ అదిరింది. ప్రోమోలు సైతం ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కి బాలయ్య జూలు విదల్చడం ఖాయంగా కనిపిస్తుంది. నెక్స్ట్ బోయపాటితో మూవీ ప్రకటించారు. 
 

Latest Videos

click me!