డివోర్స్ తర్వాత కూడా సమంత, నాగ చైతన్య గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ ని పట్టించుకోకుండా చైతు, సామ్ వాళ్ళ వాళ్ళ కెరీర్ లో ముందుకెళుతున్నారు. కొన్ని డిస్ట్రబ్ చేసే రూమర్స్ వస్తే మాత్రం ఘాటుగా బదులిస్తున్నారు. ఆ మధ్యన సమంత తన చికిత్స కోసం ఓ స్టార్ హీరో నుంచి పాతిక కోట్లు అప్పు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలని సామ్ స్వయంగా ఖండించింది.