వకీల్ సాబ్ క్రిటిక్స్ రివ్యూ... పవన్ ప్రభంజనం ముందు బాక్సాఫీస్ బద్దలేనట!

First Published Apr 8, 2021, 7:24 PM IST

అధికారికంగా పింక్ ఫస్ట్ షో ఇంకా పడలేదు. అయితే వకీల్ సాబ్ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు చూడడం జరిగింది. వారిలో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేశారు.

ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా... మూడేళ్ళ తరువాత అభిమాన హీరో పవన్ నుండి వచ్చే సినిమా ఎలా ఉంటుంది అనే ఆత్రుత మాత్రం ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. వకీల్ సాబ్ హిందీ మూవీ పింక్ కి తెలుగు రీమేక్. పవన్ అభిమానులు పింక్ ఇప్పటికే చూడడం జరిగింది. అయితే వకీల్ సాబ్ మూవీకి, ఒరిజినల్ పింక్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది.
undefined
పవన్ ఇమేజ్, స్టార్డం దృష్టిలో ఉంచుకొని వకీల్ సాబ్ చిత్రానికి చాలా హంగులు అద్దారు. హీరోయిన్ శృతి హాసన్, ఆమెతో రొమాంటిక్ సాంగ్స్, గుండాలలో ఫైట్స్ లాంటివి అన్న మాట. మూల కథను మార్చకుండా, పవన్ మార్క్ మిస్ అవకుండా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించడం జరిగింది.
undefined
అధికారికంగా పింక్ ఫస్ట్ షో ఇంకా పడలేదు. అయితే వకీల్ సాబ్ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు చూడడం జరిగింది. వారిలో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేశారు.  చాలా మంది సెన్సార్ సభ్యుల అభిప్రాయంలో వకీల్ సాబ్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ ఫీస్ట్ లా ఉంటుందట. కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన పవన్, సినిమాను అన్నీ తానై నడిపాడని అంటున్నారు. పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే కోర్ట్ రూమ్ సన్నివేశాలు, సమాజంలో ఆడవారి పట్ల ఉన్న చెడ్డ ఆలోచనల గురించి ఆలోచన చేసేవిగా ఉంటాయట.
undefined
మరొక క్రిటిక్ అభిప్రాయం ప్రకారం... వకీల్ సాబ్ ఎక్కడ కూడా ప్రేక్షకుడిని నిరాశపరిచే చిత్రం కాదట. దర్శకుడు రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చివరి వరకు ప్రేక్షకుడు కథతో ట్రావెల్ చేసేలా ఉంటుందట.  ప్రథమార్ధంలో పవన్ ఎంట్రీ లేట్ గా వచ్చినా, లేటెస్ట్ గా ఉంటుందని చెప్పడం జరిగింది.
undefined
ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు, వకీల్ సాబ్ చిత్రానికి ఏకంగా ఫోర్ స్టార్స్ ఇచ్చారు. వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ నటన ఎవరెస్ట్ రేంజ్ లో ఉందని, జాతీయ అవార్డు కొల్లగొట్టడం ఖాయం అని చెప్పాడు. ఉమర్ సంధు రివ్యూ పవన్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపింది.
undefined
ఇక సోషల్ మీడియాలో వకీల్ సాబ్ మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుండగా, పవన్ బాక్సాఫీస్ రికార్డ్స్ గొల్లగొట్టడం అనివార్యం అనిపిస్తుంది. బుకింగ్స్ రూపంలోనే రికార్డు షేర్ ఈ చిత్రం వసూలు చేయనుంది. నేడు అర్థ రాత్రి నుండే వకీల్ సాబ్ ప్రదర్శనలు జరగనున్నాయి.
undefined
undefined
click me!