మీ హాట్ ఫేవరేట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడు, ఎవరు మొదలుపెట్టారంటే..?

First Published Sep 6, 2020, 1:31 PM IST

ప్రేక్షకులను టీవీకి అతుక్కుపోయేలా చేసి, నాన్ స్టాప్ ఎంటెర్టైనర్మెంట్ పంచే బిగ్ బాస్4 కొత్త హంగులతో ముస్తాబై వచ్చేసింది. మరి బుల్లితెర ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో అసలు ఎప్పుడు, ఎవరు, ఎలా మొదలుపెట్టారో ఒకసారి చూసేద్దాం..

తెలుగు ప్రేక్షకులహాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగాప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులనుఅలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపిసీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెరసెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.
undefined
మరి ఇంతగాప్రేక్షకులఆదరణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎక్కడ, ఎలా, ఎవరు ప్రారంభించారో చూద్దాం. బిగ్ బాస్ షో జన్మస్థానం నెదర్లాండ్స్. డచ్ మీడియా కంపెనీ అధినేత జాన్ డీ మోల్ జూనియర్ ఈ బిగ్ బాస్ రియాలిటీషో కాన్సెప్ట్ కి నాంది పలికారు. ఐతే అప్పట్లో ఈ షో బిగ్ బ్రదర్ పేరుతో 1999లో మొదటిసారిగా ప్రసారం అయ్యింది.సెలెబ్రిటీల జీవితాలు, వ్యక్తిత్వాలు, వేష భాషలు, ప్రవర్తన దగ్గరగా చూపించే ఈ బిగ్ బ్రదర్ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ షో పాప్యులర్ కాగా ఈ కాన్సెప్ట్ ని దాదాపు 54 దేశాలు జాన్ డీ మోల్ జూనియర్ నుండి కొనుగోలు చేయడం జరిగింది.
undefined
2007లో ప్రసారమైన బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి పాల్గొన్నారు. ఈ షోలో ఈమెపై బ్రిటీష్ మహిళ జేన్ గూడి చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపాయి. జేన్ గూడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో పాటు, శిల్పా శెట్టి అందరి నుండి సానుభూతి సొంతం చేసుకొని విన్నర్ గా నిలిచారు.
undefined
బిగ్ బ్రదర్ కాస్తా ఆ తరువాత బిగ్ బాస్ గా మారింది. 2006లో మొదటిసారి ఇండియాలో హిందీలో బిగ్ బాస్ ప్రసారం అయ్యింది. అర్షద్ వార్షి హోస్ట్ గా వ్యవహరించగా సోనీ టీవీలో ప్రసారం అయ్యింది. ఆ తరువాత శిల్పా శెట్టి, అమితాబ్, సల్మాన్, సంజయ్ దత్ కూడా బిగ్ బాస్ హోస్ట్స్ గా వ్యవహరించారు. కొన్నాళ్లుగా సల్మాన్ బిగ్ బాస్ హోస్ట్ గా ఉంటున్నారు.
undefined
ఇక తెలుగులో బిగ్ బాస్ 2017లో ప్రారంభం అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మాలో ప్రసారమైనబిగ్ బాస్ సీజన్ 1 సూపర్ సక్సెస్అందుకుంది. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ గెలుపొందారు. ఇక సీజన్ 2కిహీరో నాని హోస్టుగావ్యవహరించగాకౌశల్టైటిల్ అందుకున్నారు.
undefined
సీజన్ 3కి హోస్ట్ గా కింగ్ నాగార్జున ఎంటర్ కావడం జరిగింది. నాగార్జున సారథ్యంలోసీజన్ 3 సక్సెస్ ఫుల్ గా సాగింది. సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్విన్నర్ గా నిలిచాడు. ఇక సెప్టెంబర్ 6నుండి ప్రసారం కానున్న సీజన్ 4కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
undefined
click me!