మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీతో తొలిసారి కలుసుకున్నారు. అక్కడే వీరిద్దరి ప్రేమకి బీజం పడింది. కొన్నేళ్ల పాటు సైలెంట్ గా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలని ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.