అఖిల్ కి అలా జరగడంతో..చిత్ర యూనిట్ ని కొట్టడానికి వెళ్లిన నాగార్జున, అమల.. డైరెక్టర్ ఏం చేశారంటే

First Published Jun 15, 2024, 3:20 PM IST

సిసింద్రీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అఖిల్ సన్నివేశాలు ఉన్న ప్రతి రోజు అమల కూడా వచ్చేవారు. అఖిల్ పసివాడు కాబట్టి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు. 

కింగ్ నాగార్జున, అమల దంపతుల ముద్దుల కొడుకు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. అయితే అఖిల్ ఇంకా తొలి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.'అఖిల్' చిత్రంతో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అఖిల్ ఇంకా బుడిబుడి అడుగులు కూడా వేయని వయసులో కెమెరాని ఫేస్ చేశాడు. సిసింద్రీ చిత్రంలో అఖిల్ కనిపించిన సంగతి తెలిసిందే. 

శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో సిసింద్రీ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర విశేషాలని ఇటీవల శివ నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అఖిల్ అంటే నాగార్జున, అమలకి ఎంత ప్రాణమో వివరించారు. సిసింద్రీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అఖిల్ సన్నివేశాలు ఉన్న ప్రతి రోజు అమల కూడా వచ్చేవారు. అఖిల్ పసివాడు కాబట్టి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు. 

Latest Videos


ఒకవేళ అమల గారు రాకుంటే కేర్ టేకర్ గా ఉండే అమ్మాయి వచ్చేది. నాగార్జున గారు తన షూటింగ్స్ లో తాను బిజీగా ఉండేవారు. కేర్ టేకర్ అమ్మాయి ఏదో పని ఉండడంతో కాస్త బయటకి వెళ్ళింది. అఖిల్ సెట్స్ లోనే కూర్చుని ఆడుకుంటున్నాడు. 

సెట్స్ లో ఒక టీపాయి ఉంటుంది. బంతి టీపాయి దగ్గరకు వెళ్లడంతో అఖిల్ ఆడుకుంటూ దాని మీద పడ్డాడు. ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ కంటిదగ్గర చిన్న గీత పడింది. అది రక్తం వచ్చేంత గాయం కూడా కాదు. చాలా చిన్నది. 

Akhil Akkineni

వెంటనే నాగార్జున ఇంటికి ఫోన్లు వెళ్లాయి. షూటింగ్ లో ఉన్ననాగార్జున హడావిడిగా కారులో వచ్చేశారు. ఇంటి నుంచి అమలగారు మరో కారులో వచ్చారు. నేను నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కి చెప్పాను.. నాగార్జున ఖచ్చింతంగా మిమ్మల్ని కొడతారు. పారిపోకండి. దెబ్బలు తిని వెళ్ళిపోతే సమస్య అంతటితో ఆగిపోతుంది. మీరు ముందుగానే దొరకకుండా పారిపోతే ఆయనకు కోపం ఇంకా పెరుగుతుంది అని చెప్పాను. 

నాగార్జున, అమల కంగారుగా వచ్చి అఖిల్ ని ఎత్తుకున్నారు. అక్కడికి నాగార్జున ఫ్రెండ్ సతీష్ కూడా వచ్చారు. ఆయన ఆయా టెన్షన్ వాతావరణాన్ని కూల్ చేశారు. వాట్ నాగ్.. ఎందుకింత టెన్షన్.. పిల్లలన్నాక దెబ్బలు తగలవా అంటూ నాగార్జునని కూల్ చేశారు. దెబ్బ కూడా పెద్దది కాకపోవడంతో నాగ్, అమల కూడా ఊపిరి పీల్చుకున్నారు. 

నాగార్జున, అమల సీరియస్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేను. షూటింగ్ ఆగిపోయి ఉన్నా ఆశ్చర్యం లేదు. నాగార్జున ఫ్రెండ్ సతీష్ దేవుడిలా వచ్చాడు అని డైరెక్టర్ శివ నాగేశ్వర రావు అన్నారు. 

click me!