మేకప్‌ వేసుకోకుండా నిజస్వరూపం బయటపెట్టిన హేబా పటేల్‌.. హాట్ స్పాట్‌ చూపిస్తూ అసలైన అందంతో షాకిచ్చిన కుమారి..

Published : Jun 07, 2023, 12:13 PM IST

తెలుగు తెర కుమారిలా పేరుతెచ్చకుంది హేబా పటేల్‌. గ్లామర్‌ పాత్రల నుంచి బలమైన పాత్రల వైపు టర్న్ తీసుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్‌ ట్రీట్‌ ఇస్తూనే ఉంది.  

PREV
17
మేకప్‌ వేసుకోకుండా నిజస్వరూపం బయటపెట్టిన హేబా పటేల్‌.. హాట్ స్పాట్‌ చూపిస్తూ అసలైన అందంతో షాకిచ్చిన కుమారి..

హేబా పటేల్‌ తాజాగా మేకప్‌ లేకుండా కనిపించింది. విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ గత కొన్ని రోజులుగా వెకేషన్‌లోనే ఉంది. అయితే ఈ సారి మాత్రం పెద్ద షాకిచ్చింది. ఓ భారీ సాహసం చేసింది. హీరోయిన్లు సహజంగా ఇలాంటి సాహసం చేసేందుకు ఆసక్తి చూపరు. నిజ స్వరూపాలను బయటపెట్టరు. 
 

27

హేబా పటేల్‌ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. మేకప్‌ వేసుకోకుండా ఫోటోలు దిగింది. పార్క్ లో చిల్‌ అవుతూ దిగిన ఫోటోలను ఆమె ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం విశేషం. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు ఇంటర్నెట్లో రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 
 

37

గత కొన్ని రోజులుగా హేబా పటేల్‌ అమెరికాలో విహార యాత్రని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వీధులన్నీ తిరుగుతూ అక్కడి అందాలను ఆస్వాదిస్తుంది. రెగ్యూలర్‌గా తాను చూసిన అందాలను బంధించి సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఫ్యాన్స్ ని అలరిస్తుంది. 

47

హేబా పటేల్‌ ఇటీవల `వ్యవస్థ` అనే వెబ్‌ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇది ఓటీటీలో విడుదలై మిలియన్స్ వ్యూస్‌ని పొందింది. అత్యధిక వ్యూస్‌ అందుకున్న వెబ్‌ సిరీస్‌గా నిలిచింది. ఇందులో న్యాయం కోసం పోరాడే అమ్మాయిగా బలమైన పాత్రలో నటించింది. తన నటనకు మంచి మార్కులు వేసుకుంది. 
 

57

ఇక సినిమాల పరంగానూ తన పంథాని మార్చింది. గతంలో మాదిరిగా గ్లామర్‌ పాత్రలు, బోల్డ్ ఇంటెన్స్ పాత్రలు కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె సక్సెస్‌ అవుతుంది. అయితే గ్లామర్‌ షో చేస్తే వచ్చే ఆఫర్లు ఇప్పుడు రావడం లేదు. అడపాదడపా ఆమె అవకాశాలను అందుకుంటుంది. 
 

67

సినిమాల పరంగా ఇటీవల `గీత` అనే సినిమాలో నటించింది హేబా పటేల్‌. ఇది పెద్దగా ఆడలేదు. అంతకు ముందు `ఓడెల రైల్వే స్టేషన్‌` ఈ బ్యూటీకి పేరుతీసుకొచ్చింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం `తెలిసినవాళ్లు` అనే చిత్రంలో నటిస్తుంది. తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. 
 

77

అయితే చిన్న సినిమాలే వస్తున్నాయి, కానీ పెద్ద ప్రాజెక్ట్ లు రావడం లేదు. ఆ విషయంలో కొంత కొరతే ఈ బ్యూటీని వెంటాడుతుందని చెప్పొచ్చు. పైగా కమర్షియల్‌ హీరోయిన్‌ ఫీచర్స్ లేకపోవడం కూడా ఈ అమ్మడికి మైనస్‌గా మారుతుందని చెప్పొచ్చు. అందుకే అందివచ్చిన ఆఫర్లతో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. సినిమా, వెబ్‌ సిరీస్‌లు అనేది చూడకుండా చేసుకుంటూ వెళ్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories