ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్... అందరి చూపు ఈతరం రామయ్య మీదే!

Published : Jun 07, 2023, 11:59 AM ISTUpdated : Jun 07, 2023, 12:18 PM IST

ఆదిపురుష్ చిత్ర విడుదలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   

PREV
19
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్... అందరి చూపు ఈతరం రామయ్య మీదే!
Adipurush Pre Release Event

తిరుపతి వేదికగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుక ఘనంగా ముగిసింది. ఈ వేడుకకు హీరో ప్రభాస్ తో పాటు హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

29
Adipurush Pre Release Event

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. రామాయణ గాథ కావడంతో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అతిథిగా పాల్గొన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు లక్షల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.

39
Adipurush Pre Release Event

లక్షల్లో హాజరైన అభిమానులు ప్రభాస్ ని చూసేందుకు ఎగబడ్డారు. ఆయన మాట్లాడుతుంటే నినాదాలు చేశారు.ఫ్యాన్స్ కోసం వేగంగా సినిమాలు చేస్తానంటూ ప్రభాస్ హామీ ఇచ్చారు. వేదికల మీద తక్కువ మాట్లాడతాను. ఎక్కువ సినిమాలు చేస్తాను, అన్నారు.

49
Adipurush Pre Release Event

ఆదిపురుష్ టీం ఏడు నెలలు నిద్రలేకుండా పని చేశారని కొనియాడారు. ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్ సూపర్ మాన్. జీవితంలో అంత కష్టపడే వ్యక్తిని చూడలేదని అన్నారు. ఆదిపురుష్ సినిమా కాదు ఎమోషన్ అన్నారు. హీరోయిన్ కృతి సనన్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరి చూపు ఈ మోడ్రన్ రాముని మీదే ఉంది.

59
Adipurush Pre Release Event

ప్రభాస్ తెల్లని సాంప్రదాయ దుస్తులను తలపించే స్పెషల్ డిజైనర్ వేర్ ధరించారు. ప్రభాస్ రాకతో ప్రాంగణం మారుమ్రోగింది. అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభాస్ అభిమానులకు అభివాదం చేశారు. బాణాసంచా వెలుగులతో యూనిట్ ఆయనకు స్వాగతం పలికింది.  ప్రభాస్ రాకతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి కళ సంతరించుకుంది.

69
Adipurush Pre Release Event


కాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాతలు కోట్లలో ఖర్చు చేస్తున్నారట. కేవలం బాణా సంచా కోసం రూ. 50 లక్షలు కేటాయించారట. ఇక ఈవెంట్ నిర్వహణకు మొత్తంగా రూ. 2.5 కోట్లు వెచ్చించినట్లు సమాచారం అందుతుంది. గతంలో ఏ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంత మొత్తంలో ఖర్చు చేయలేదని చెప్పవచ్చు. ఇది హాట్ టాపిక్ గా మారింది. 

79
Adipurush Pre Release Event


ఆదిపురుష్ జూన్ 16న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  విడుదల కానుంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2023 సంక్రాంతికి విడుదల చేయాలని మొదట భావించారు. కొన్ని అనివార్య కారణాలతో విడుదల ఆలస్యమైంది. 
 

89
Adipurush Pre Release Event

ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాఘవుడు పాత్ర చేస్తున్నారు. కృతి సనన్ జానకిగా కనిపించనున్నారు. ఇక కీలకమైన రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అలరించనున్నారు. టి సిరీస్, యూవీ క్రియేషన్స్ ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మించాయి. అజయ్-అతుల్ సంగీతం అందించారు. 
 

99
Adipurush Pre Release Event

ఆదిపురుష్ చిత్ర విడుదలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories