హేబా పటేల్.. గ్లామర్ బ్యూటీగానే ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రారంభంలోనే సాహసం చేసింది. `కుమారి 21ఎఫ్`లో ఆమె చేసిన సాహసం మామూలుది కాదు, అంత బోల్డ్ గా నటించడం అదే మొదటిసారి చెప్పొచ్చు. అదొక ట్రెండ్ సెట్టర్. హేబా పటేల్ పాత్ర కూడా ట్రెండ్ సెట్టరే. అలాగని అది బూతు కాదు, అందులో ప్రేమలోని రొమాన్స్ ఉండి, పోయెట్రీ, నేటి ట్రెండూ ఉంది. అందుకే ఆ సినిమా, హేబా ఆడియెన్స్ కి బాగా ఎక్కేశారు.